
హైదరాబాద్: పూణెలోని మలంగె బాలెవాడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టెన్నిస్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ తన ప్రతిభను చాటాడు. టాటా ఓపెన్ మహారాష్ట్రలో భాగంగా సోమవారం పురుషుల సింగిల్స్ కాంపిటేషన్స్ జరుగుతున్నాయి. చెన్నైకు చెందిన రామ్‌కుమార్ ప్రత్యర్థి రొబర్టో కార్బల్స్‌తో ఆడి రెండు రౌండ్లలో వరుస విజయాలను చేజిక్కుంచుకున్నాడు.
ప్రపంచ స్థాయిలో 148వ ర్యాంకు ఉన్న రొబర్డో కార్నల్స్ మ్యాచ్‌కు వైల్డ్ కార్డ్ తో ప్రవేశం దొరికింది. బలమైన ప్రత్యర్థులు ఉంటే మ్యాచ్ మాంచి రసవత్తరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే అతన్ని వైల్డ్ కార్డ్తో మ్యాచ్‌కి ప్రవేశించడానికి అనుమతినిచ్చారు.
వారి అంచనా తప్పలేదు. మొదటి రౌండ్లో 7-6, 6-2 స్కోరులను చేసేందుకు పరిస్థితులు అనుకూలించాయి. మొదటి రౌండు గట్టి పోటీ ఇచ్చినా టై బ్రేక్ పూర్తయి రెండో రౌండ్‌కి వచ్చే సరికి నాలుగు పాయింట్ల తేడాతో స్కోరుతో రామ్ కుమార్ విజయం సాధించాడు. 2018 సంవత్సరానికి ఓ శుభారంభాన్నిచ్చాడు.
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్‌మన్ గిల్స్ ఈ సీజన్‌ను యూఎస్‌ఏకు చెందిన టెన్నీస్ సాండ్‌గ్రెన్‌తో తలపడి 6-4, 6-1 తేడాతో విజయాన్ని సాధించాడు. గిల్స్‌కు 2017 పూర్తిగా అసంతృప్తిని మిగిల్చినా కొత్త సంవత్సరం కొంత ఊరటనిచ్చింది.
ఫస్ట్ రౌండ్‌లో రికార్డొ ఓజెదా లారా ఆరో ప్రత్యర్థిగా దిగిన జిరి వెసెలీ ఓడించి గేమ్‌కు హైలెట్‌గా నిలిచాడు. వారిద్దరి మధ్య జరిగిన గేమ్‌లో 6-3, 7-6 పాయింట్లతో విజయాన్ని సాధించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.