Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షరపోవాకు అనూహ్య మద్దతు, 'సంపాదిస్తున్నావ్‌గా..'

లాస్ ఏంజిల్స్: నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడి వేటుకు గురైన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాకు అనూహ్య మద్దతు లభించింది. ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ బుధవారం స్పందించారు. క్రీడలను రాజకీయం చేస్తున్నారన్నారు.

క్రీడలను కొన్ని రకాల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. క్రీడలకు ఇది ఏ మాత్రం మేలు చేయదన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. షరపోవా విషయంలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నామని, కానీ ఈ విషయాన్ని ఈ విధంగా ప్రచారం చేసి ఉండాల్సింది కాదన్నారు.

Kremlin hits back in Maria Sharapova scandal

షరపోవాపై ఆగ్రహం

గత పదేళ్లుగా తాను మెల్డోనియం డ్రగ్‌ని తీసుకుంటున్నానని టెన్నిస్ తార మారియా షరపోవా స్వయంగా వెల్లడించడాన్ని ఆ ఔషధాన్ని తయారు చేస్తున్న లాత్వియా సంస్థ గ్రిండెక్స్ తప్పుబట్టింది. మెల్డోనియం వాడాల్సి వస్తే నాలుగు నుంచి ఆరు వారాల పాటు వాడితే కోర్సు పూర్తవుతుందని పేర్కొంది.

ఎలాంటి రుగ్మతకైనా పదేళ్ల పాటు వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆమె మెల్డోనియాన్ని ఉత్ప్రేరకంగానే వాడారని ఆరోపించింది. మెల్డోనియంను ఏడాదిలో రెండు కోర్సుల వరకూ తీసుకోవచ్చని తెలిపింది.

మరోవైపు, డోప్ టెస్టులో విఫలమైన షరపోవాను క్షమించరాదని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) అధ్యక్షులు డిక్ పౌండ్ అన్నారు. ఈ ఉదంతానికి పూర్తిగా షరపోవానే బాధ్యత వహించాలని, ఆమెపై ఎలాంటి జాలి చూపరాదన్నారు.

నీవు ప్రతిఏటా దాదాపు 30 మిలియన్ డాలర్లకు పైగా సంపాదిస్తున్నావని, ఈ సంపదనంతా ఎలా కాపాడుకుంటున్నావో, నీ ఆటకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలన్నది నీకు తెలియదా? అని షరపోవాను అతను ప్రశ్నించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+