Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French Open: అయ్యో జకోవిచ్.. కొంపముంచిన గాయం!

25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ ఆడకుండానే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా ఆటగాడు సెరున్‌డొలో‌పై జకో అతికష్టంగా గెలిచిన సంగతి తెలిసిందే.

తొలి సెట్ గెలిచినా, తర్వాత రెండు సెట్లను చేజార్చుకున్నాడు. కానీ తర్వాత గొప్పగా పుంజుకుని క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఈ పోరులో జకోవిచ్ జారిపడటంతో మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా క్వార్టర్స్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో కాస్పర్‌ రూడ్‌ (నార్వే) క్వార్టర్ ఫైనల్‌‌లో తలపడకుండానే నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాడు.

Knee Injury Forces Novak Djokovic to Withdraw from French Open

సెమీస్‌లో స్వైటెక్
టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) సునాయాసంగా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వోండ్రుసోవాను 6-0, 6-2 తేడాతో ఓడించింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సెట్‌ను గెలిచింది. రెండో సెట్‌లో వోండ్రుసోవా ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది.

మరోవైపు అమెరికా స్టార్ కోకో గాఫ్ కూడా సెమీఫైనల్స్‌కు వచ్చింది. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో గాఫ్‌కు ఇది వరుసగా మూడో సెమీస్. యూఎస్ ఓపెన్‌లో టైటిల్ సాధించిన ఆమె, ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ వరకు పోరాడింది. కాగా, క్వార్టర్స్‌లో ఆన్స్ బజర్ (ట్యునీషియా)పై 4-6, 6-2, 6-3తో విజయం సాధించింది. సెమీఫైనల్లో ఇగా స్వైటెక్‌తో కోకో గాఫ్ తలపడనుంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌ చేరడం గాఫ్‌కు ఇదే తొలిసారి.

మెన్స్ సింగిల్స్‌లో ఇటలీ ప్లేయర్ జానెక్‌ సినర్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై‌ సినర్‌ 6-2, 6-4, 7-6 (7-3)తో గెలిచాడు. వరుసగా మూడు సెట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించి సినర్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరడం సినర్‌కు కూడా ఇదే మొదటిసారి.

Story first published: Wednesday, June 5, 2024, 9:30 [IST]
Other articles published on Jun 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+