న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అడ్డంకిగా మోకాలి గాయం... లేదంటే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే బరిలోకి!

 Kim Clijsters announces plan to make tour comeback in March

హైదరాబాద్: బెల్జియం స్టార్ టెన్నిస్‌ ప్లేయర్ కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ వచ్చే ఏడాది మార్చిలో పునరాగమనం చేసేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌కు మైదానంలోకి రావాలనుకున్న 36 ఏళ్ల క్లియ్‌స్టర్స్‌కు మోకాలి గాయం అడ్డంకిగా మారింది.

దాని నుంచి కోలుకుని మార్చిలో మెక్సికో వేదికగా మాంట్రెరీ టోర్నీ ద్వారా తాను మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని తెలిపింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేసింది. అందులో నేను సిద్ధమవడానికి మరికొన్ని వారాల సహనం అవసరమని తెలిపింది.

పాకిస్థాన్‌కు మింగుడుపడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం!పాకిస్థాన్‌కు మింగుడుపడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం!

దీంతో క్లియ్‌స్టర్స్‌ వచ్చే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. బిడ్డకు జన్మనివ్వడం కోసం తొలిసారి 2007లో రిటైరైన క్లియ్‌స్టర్స్‌ ఆ తర్వాత 2009లో పునరాగమనం చేసి రెండేళ్ల పాటు ఆటలో కొనసాగింది. 2011లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచాక రెండోసారి రిటైర్మెంట్‌ తీసుకుంది.

36 ఏళ్ల క్లియ్‌స్టర్స్ వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తిరిగి పోటీకి రావాలని అనుకుంది. అయితే, ఆమె మోకాలి గాయం అందుకు అడ్డుపడింది. దీంతో వచ్చే ఏడాది మోంటెర్రే (మార్చి 2-8) టోర్నీతో పునరాగమనం చేయనుంది. ఆ తర్వాత ఇండియన్ వెల్స్ (మార్చి 11-22), చార్లెస్టన్ (ఏప్రిల్ 4-12) ఆడనున్నట్లు క్లియ్‌స్టర్స్ పేర్కొంది.

క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా! ధోనీకి అరుదైన గౌరవంక్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా! ధోనీకి అరుదైన గౌరవం

2003, 2005లో క్లియ్‌స్టర్స్ ఇండియా వెల్స్ టోర్నీ టైటిళ్లను గెలిచింది. ఆమె కెరీర్‌లో మొత్తం 41 టైటిళ్లు ఉన్నాయి. ఇందులో మూడు యుఎస్ ఓపెన్(2005, 2009 and 2010), ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఉంది. 1997లో ప్రొపెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిని క్లియ్‌స్టర్స్ 2003లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, December 24, 2019, 13:09 [IST]
Other articles published on Dec 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X