సిడ్నీ:జోరు మీదున్న కిదాంబి శ్రీకాంత్ అస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజయం సాధించాడు.చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ పై 22-2-, 21-16 వరసు సెట్లతో శ్రీకాంత్ విజయం సాధించాడు. మంచి ఫామ్ లో ఉన్న శ్రీకాంత్ వారం రోజు వ్యవధిలోనే రెండో టైటిల్ ను సాధించారు.
అస్ట్రేలియన్ సూపర్ సిరీస్ ను తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకొన్నాడు. తొలి సెట్ ను గెలుచుకొన్న ఆనందంలో రెండో సెట్ ఆరంభంలో కొన్ని తప్పులు చేసినప్పటికీ వెంటనే తేరుకొన్నాడు శ్రీకాంత్.
వెంటనే తన తప్పులను సవరిదిద్దుకొన్నాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే శ్రీకాంత్ మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకొన్నాడు.
ప్రత్యర్థి పై చేయి సాధించకుండా అడ్డుకొన్నాడు. ఈ మ్యాచ్ లో అడుగడుగునా శ్రీకాంత్ కు భారత అభిమానులు మంచి ప్రోత్సాహన్ని ఇచ్చారు.ఈ విజయంతో శ్రీకాంత్ ప్రస్తుత సీజన్ లో నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకొన్నటైంది.