హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ భారత్‌కి చెందిన మరో ఆటగాడు సాయి ప్రణీత్‌పై గెలుపొందాడు. పురుషులు సింగిల్స విభాగంలో వీరిద్దరూ తలపడ్డారు. ఈ ఇద్దరి మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
43 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రెండు వరుస గేమ్‌లను శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. తొలి గేమ్‌ను 25-23తో సొంతం చేసుకున్న శ్రీకాంత్, ఆ తర్వాత రెండో గేమ్‌ని 21-17తో కైవసం చేసుకొని మ్యాచ్ విజేతగా నిలిచాడు. దీంతో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సాయి ప్రణీత్ చేతిలో ఎదురైన ఓటమికి శ్రీకాంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
టైటిల్ పోరులో శ్రీకాంత్‌పై సాయి ప్రణీత్ గెలిచి టైటిల్‌ను కైవసం చేసకున్న సంగతి తెలిసిందే. ఇక ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలిచిన శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా అదే ప్రదర్శన చేస్తున్నాడు.