క్రెడిట్ అంతా వారిదే: గోపీచంద్ అకాడమీలో శ్రీకాంత్‌కి అభినందన సభ
హైదరాబాద్: ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్‌లో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇండోనేషియన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్ల విజయం అనంతరం కిదాంబి శ్రీకాంత్ మంగళవారం భారత్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో బంధుమిత్రులు, అభిమానులు శ్రీకాంత్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో శ్రీకాంత్‌తోపాటు ప్రణయ్, సాయిప్రణీత్‌లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. వరుసగా రెండు సూపర్ సిరిస్‌లు గెలిచినందకు బహుమతిని ప్రదానం చేశారు.

నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. గత రెండు వారాలుగా మంచి ఫలితాలు సాధించగలిగామని, తనతోపాటు ప్రణయ్, సాయి ప్రణీత్ కూడా బాగా రాణించారని అన్నారు. ప్రతి మ్యాచ్ కష్టమైనదే, ఆయితే ఆత్మ విశ్వాసంతో ఆడేందుకు కృషి చేశానని పేర్కొన్నాడు.

టాప్ 10 ర్యాంకింగ్స్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది
ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్‌లో చేరినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. గాయం తర్వాత రాణించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. తనతో పోరాడిన వారే తనను మరింత రాటుతేలేలా చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ప్రతిభ ప్రదర్శిస్తామని ప్రణయ్ పేర్కొన్నాడు.
గోపీచంద్ శిక్షణ లేకుండా ఈ విజయాలు సాధ్యమయ్యేవికావు
గోపీచంద్ శిక్షణ లేకుండా ఈ విజయాలు సాధ్యమయ్యేవికావని శ్రీకాంత్ తెలిపాడు. ఆ తర్వాత మాట్లాడిన గోపీచంద్ తక్కువ సమయంలో ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్‌లకు అభినందనలు తెలిపారు.

గోపిచంద్‌కు ధన్యవాదాలు తెలిపిన సాయి ప్రణీత్
ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ చేతిలో ఓటమి పాలైన సాయి ప్రణీత్ తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న గోపిచంద్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతకముందు శంషాబాద్ విమానాశ్రయంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడాడు. నా పట్టుదల, శ్రమకు లభించిన ఫలితమిదని తెలిపాడు. తన తరువాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ చాపియన్‌షిప్. దాదాపు ఆరు వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టిపెట్టి సిద్ధమవుతానని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications