న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ వెల్స్: చిత్తుగా ఓడిపోయిన ఫెదరర్

Juan Martin del Potro relives incredible Rafael Nadal memory at Indian Wells

హైదరాబాద్: ఫెదరర్‌ జోరుకు అడ్డుకట్ట పడింది. 2018లో వరుసగా 17 విజయాలు నమోదు చేసిన స్విస్ దిగ్గజానికి ఇండియానావెల్స్ ఫైనల్లో ఊహించని షాక్ తగిలింది. అర్జెంటీనా ఆటగాడు మార్టిన్‌ డెల్‌పొట్రో అతడికి చెక్‌ పెట్టి, ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. వరుస వైఫల్యాలు, ఫిట్‌నెస్ సమస్యలతో కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసుకున్న అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో.. ఏకంగా ఫెదరర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.

హోరాహోరీగా సాగిన ఫైనల్లో డెల్‌పోట్రో 6-4, 6-7 (8/10), 7-6 (7/2)తో ఫెదరర్‌ను ఖంగుతినిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన డెల్‌పోట్రో తొలి సెట్‌ను కాసింత సులువుగానే దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో స్విస్ దిగ్గజం నుంచి గట్టి పోటీ ఎదురైంది. టై బ్రేకర్‌లో 8-7 వద్ద ఉన్నపుడు డెల్‌పోట్రో అనవసర తప్పిదాల వల్ల మూడు మ్యాచ్ పాయింట్లు చేజార్చుకున్నాడు.

దీంతో మ్యాచ్ మూడో సెట్‌కు దారితీసింది. మూడో సెట్‌లో ఇద్దరూ పదునైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నారు. అయితే ఫెదరర్ అద్భుతమైన బ్యాక్ హ్యాండ్‌తో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 5-4 ఆధిక్యంలోకి వచ్చాడు. రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నట్లైతే ఫెదరర్ రేసులోకి వచ్చేవాడు. కానీ డెల్‌పోట్రో దూకుడుతో మ్యాచ్ టై బ్రేకర్‌కు దారితీసింది. టై బ్రేకర్‌లో ఫెదరర్ రెండు డబుల్ ఫాల్ట్స్ చేయడంతో ప్రత్యర్థి 6-1 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు.

ఆ తర్వాత ఫెదరర్ ఫోర్‌హ్యాండ్ షాట్‌కు చెక్ పెట్టి మూడో మ్యాచ్‌పాయింట్‌ను సాధించడం ద్వారా డెల్‌పోట్రో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇండియానావెల్స్ ట్రోఫీని గెలువడం డెల్‌పోట్రోకు ఇదే తొలిసారి. ఫెడరర్‌తో 25సార్లు ముఖాముఖి పోరులో డెల్‌పొట్రొకిది ఏడో విజయం. తాజా విజయంతో ఇతడు 2014 తర్వాత తొలిసారిగా టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాడు.

మహిళల విజేత ఒసాకా
ఇండియన్‌ వెల్స్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‌ యువ సంచలనం నవొమి ఒసాకా విజేతగా నిలిచింది. 20 ఏళ్ల ఒసాకా ఫైనల్లో 6-3, 6-2తో రష్యా యువ క్రీడాకారిణి డారియా కసట్కినాను ఓడించి టైటిల్‌ అందుకుంది. ఇవనోవిచ్‌ తరువాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న పిన్న వయస్కురాలుగా ఒసాకా నిలిచింది.

అన్‌సీడెడ్‌ ఒసాకా టైటిల్‌ను సాధించే నేపథ్యంలో హేమాహేమీలు షరపోవా, ప్లిస్కోవా, ప్రపంచ నంబర్‌ వన్‌ సిమోనా హాలె్‌పలను దాటుకుని ఫైనల్‌ చేరుకుంది. ఈ విజయంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఒసాకా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 22వ ర్యాంక్‌కు చేరుకోనుంది.

Story first published: Tuesday, March 20, 2018, 9:15 [IST]
Other articles published on Mar 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X