For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్‌లో భారత్ ఘనకీర్తి.. 14 ఏళ్లకే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్! ఎవరీ జెన్సీ కానాబార్?

Australian Open U14: టెన్నిస్ ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని ఓ చిన్నారి రెపరెపలాడించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ టెన్నిస్ సంచలనం జెన్సీ కానాబార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 14 ఏళ్ల ప్రాయంలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్-14 టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

ఓటమి అంచు నుంచి అద్భుత విజయం
మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జెన్సీ కానాబార్, ఆస్ట్రేలియాకు చెందిన ముసెమ్మా కిలెక్‌తో తలపడింది. ఒకానొక దశలో జెన్సీ 3-6, 0-2తో వెనుకబడి ఓటమి అంచున నిలిచింది. అయితే అసాధారణ పోరాట పటిమను కనబరిచిన ఆమె.. తర్వాతి రెండు రౌండ్లలో 6-4, 6-1 స్కోరుతో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గతేడాది బాలుర విభాగంలో అర్ణవ్ పాపర్కర్ ఈ టైటిల్ గెలవగా.. ఇప్పుడు బాలికల విభాగంలో జెన్సీ ఆ రికార్డును సమం చేసింది.

Jensi Kanabar Wins Australian Open U14 Title First Indian Female Tennis Player to Create History

ఎవరీ జెన్సీ కానాబార్?
గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన జెన్సీ కానాబార్ భారత టెన్నిస్ రంగంలో అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) అండర్-14, అండర్-16 విభాగాల్లో నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 2025లో ఏషియన్ అండర్-14 ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జెన్సీ.. తన అరంగేట్రంలోనే ఐటీఎఫ్ (ITF J30) అహ్మదాబాద్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.2026 ప్రారంభంలోనే ఆమె AITA ఉమెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్‌లో కూడా నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం.

Story first published: Friday, January 30, 2026, 19:10 [IST]
Other articles published on Jan 30, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+