Tennis: మరో తరం మొదలైంది!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ ఇటలీ స్టార్ జానిక్ సినర్ విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో టాప్ సీడ్ సినర్‌కు ఇది రెండో టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అతను ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే సినర్ యూఎస్ ఓపెన్ నెగ్గడంతో కొత్త తరం మొదలైందని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోజర్ ఫెదరర్ ఇప్పటికే ఆటకు ముగింపు చెప్పాడు. ఇక రఫెల్ నాదల్ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. నొవాక్ జకోవిచ్ కుర్రాళ్లతో పోటీపడుతున్నప్పటికీ గాయాలు అతన్ని వేధిస్తున్నాయి. మరోవైపు ఈ సీజన్‌లో సినర్, అల్కరాస్ చెరో రెండు టైటిళ్లు గెలుకున్నారు.

దీంతో యువ ఆటగాళ్ల ఆధిపత్యం మొదలైందని, టెన్నిస్ చరిత్రలో కొత్త తరం ప్రారంభమైందని అంటున్నారు. అల్కరాస్ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలవగా, సినర్ రెండు టైటిళ్లు నెగ్గాడు. అయితే యూఓపెనర్‌లో సినర్ పోరాటం అసాధారణమైనది. కోర్టులో పాటు మానసికంగానూ సినర్ పోరాడాడు. సినర్ రెండు సార్లు డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడలేదని సినర్ వాదనను ప్రపంచ టెన్నిస్ డోపింగ్ వ్యతిరేక సమాఖ్య అంగీకరించడంతో అతను నిషేధానికి గురికాలేదు. కానీ సమాఖ్య సినర్‌కు అనుకూలంగా వ్యవహరించిందని జకోవిచ్, అల్కరాస్ వంటి ఆటగాళ్లు సైతం వ్యాఖ్యానించారు. ఈ తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో ప్రపంచ నంబర్ వన్ సినర్ యూఎస్ ఓపెన్ బరిలోకి దిగి టైటిల్ నెగ్గాడు.
కాగా, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన ఫ్రిట్జ్ ఏడో స్థానం సాధించాడు. సినర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇగా స్వైటెక్ టాప్ ర్యాంక్‌లో ఉండగా, యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత సబలెంక రెండో స్థానంలో, రన్నరప్ జెస్సికా పెగులా ఏడో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications