గాయం నుంచి ఫెదరర్ కోలుకున్నా టాప్ 4 కష్టమే
హైదరాబాద్: దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ మళ్లీ తిరిగి టాప్ నాలుగు స్థానాల్లో చోటు సంపాదించడం కష్టమేనని స్విస్ ఆటగాడు వావ్‌రింకా అన్నాడు. రోజర్ ఫెదరర్ (35) మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది జులై నుంచి టెన్నిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
17 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించిన రోజర్ ఫెదరర్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన కూతుళ్లతో ఆడుతున్న సమయంలో గాయానికి లోనయ్యాడు. రోజర్ ఫెదరర్ ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ, మళ్లీ తిరిగి టాప్ నాలుగు స్థానాల్లోకి వస్తారని ఆశించడం లేదని వావ్‌రింకా అనుమానం వ్యక్తం చేశాడు.
షాంఘై టోర్నీలో ఆడుతున్న వావ్‌రింకా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఫెదరర్ ఇలా గాయాలు పాలవడం ఇదే మొదటిసారి కాదన్నాడు. వంద శాతం ఫిట్ అయితేనే తిరిగి మళ్లీ రాకెట్ పట్టే అవకాశం ఉందని వెల్లడించాడు.

వచ్చే జనవరిలో హాప్‌మ్యాన్ కప్‌లో ఫెదరర్ మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకుల్లో రోజర్ ఫెదరర్ ఏడవ, నాదల్ ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. 2003 తర్వాత ఫెదరర్ టాప్ నాలుగు స్థానాల్లో లేకపోవడం ఇదే తొలిసారి.
అయితే ఒకవేళ ఫెదరర్ పూర్తిగా కోలుకుంటే మాత్రం అతన్ని ఆపడం సాధ్యంకాదని వావ్‌రింకా అభిప్రాయపడ్డాడు. వావ్ రింకా, రోజర్ ఫెదరర్ కొన్నిసార్లు డబుల్ పార్టనర్స్‌గా వ్యవహించారు. ప్రస్తుతం ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో జోకోవిచ్, ముర్రే, వావ్‌రింకాలు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications