న్యూఢిల్లీ: ప్రస్తుతం అందరి దృష్టి ట్వంటీ 20 ప్రపంచ కప్ పైనే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రివ్యూలాంటి ఓ చిన్న వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
భారత టెన్నిస్ తార సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. దంపతులిద్దరు కలిసి తమ తమ దేశాల గొప్పతనం గురించి చెబుతూ గొడవపడే ఓ పాకిస్తానీ యాడ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది.

హాలులో ఫోటో తగిలించే విషయంలో మొదలయ్యే ఈ వాగ్వాదం ఇరు దేశాల వైపు మళ్లుతుంది. సానియా 'అమృ
త్‌సర్ లడ్డూలు' అంటే, కాదు 'ముల్తాన్ కా సోన్ అల్వా' అని షోయబ్ మాలిక్ అంటాడు.
ఈ వాగ్వాదం క్రికెట్ వైపు మళ్లుతుంది. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఇష్టమని సానియా మీర్జా చెబుతుంది. దానికి షోయబ్ మాలిక్.. తనకు అక్తర్ యార్కర్లు ఇష్టమని బదులిస్తాడు. ఇలా పోటాపోటీగా సాగిన వాదులాటలో ఎవరు గెలిచారు? ఈ భార్యాభర్తల గొడవ సద్దుమణిగిందా? అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.