ఏడాదంతా అద్భుతమే: సినిమాపై సానియా(పిక్చర్స్)
హైదరాబాద్: రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ప్రపంచ నంబర్‌వన్ హోదా.. ఇలా ఈ ఏడాది తన కెరీర్ అద్భుతంగా సాగిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. వాలినీ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సానియా మీర్జా మంగళవారం 'వాలినీ స్ప్రే'ను ఆవిష్కరించింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నాకు మరపురానిదని చెప్పాలి. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా సీజన్‌కు గుడ్‌బై చెబుతున్నాను. రెండు మేజర్ టైటిళ్లు, పది డబ్ల్యూటీఏ ట్రోఫీలు సొంతం చేసుకున్నాను. ఇంత ఉన్నతస్థాయిలో ఏడాదిని ముగించడం కన్నా ఆనందం ఇంకేముంటుంది?' అని సానియా చెప్పింది.
ఇక సినిమా రంగంలో తాను కాలు మోపుతున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా సానియా తెలిపింది. టెన్నిస్‌పైనే తన దృష్టంతా ఉందని, సినిమా పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాదిలో సానియా మీర్జా వింబుల్డన్, యూఎస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ లతోపాటు పలు ఇతర టోర్నీల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఏడాది ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టైటిళ్లు సాధించేందుకు సిద్ధమవుతానని సానియా మీర్జా పేర్కొంది.

సానియా మీర్జా
రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ప్రపంచ నంబర్‌వన్ హోదా.. ఇలా ఈ ఏడాది తన కెరీర్ అద్భుతంగా సాగిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది.

సానియా మీర్జా
వాలినీ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సానియా మీర్జా మంగళవారం ‘వాలినీ స్ప్రే'ను ఆవిష్కరించింది.

సానియా మీర్జా
‘ఈ ఏడాది నాకు మరపురానిదని చెప్పాలి. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా సీజన్‌కు గుడ్‌బై చెబుతున్నాను. రెండు మేజర్ టైటిళ్లు, పది డబ్ల్యూటీఏ ట్రోఫీలు సొంతం చేసుకున్నాను. ఇంత ఉన్నతస్థాయిలో ఏడాదిని ముగించడం కన్నా ఆనందం ఇంకేముంటుంది?' అని సానియా చెప్పింది.

సానియా మీర్జా
ఇక సినిమా రంగంలో తాను కాలు మోపుతున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా సానియా తెలిపింది.

సానియా మీర్జా
టెన్నిస్‌పైనే తన దృష్టంతా ఉందని, సినిమా పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

సానియా మీర్జా
ఈ ఏడాదిలో సానియా మీర్జా వింబుల్డన్, యూఎస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ లతోపాటు పలు ఇతర టోర్నీల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఏడాది ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టైటిళ్లు సాధించేందుకు సిద్ధమవుతానని సానియా మీర్జా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications