For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరీనా: శుభాకాంక్షల వెల్లువ

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సెరెనా గత కొన్నేళ్లుగా రిడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహనియన్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరికి 201

ఫ్లోరిడా: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సెరెనా గత కొన్నేళ్లుగా రిడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహనియన్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరికి 2015లో రోమ్‌లో నిశ్చితార్థం జరిగింది.

తాను గర్భవతినని సెరెనా ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సెరెనా.. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె కోచ్‌ పాట్రిక్‌ మోర్టాగ్లో అధికారికంగా వెల్లడించాడు. దీంతో రఫా నాదల్ లాంటి టెన్నిస్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా సెరెనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

It's a baby girl for Serena Williams

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ని సెరెనా గెలుచుకున్నారు. అంతేగాక, ఇప్పటి వరకు 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మాజీ నంబర్‌వన్‌ 2018లో తిరిగి టెన్నిస్‌ కోర్టులో అడుగుపెడుతుందని ఆమె కోచ్‌ పాట్రిక్ తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+