న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటిల్‌కు అడుగుదూరంలో సెరెనా

Its as if Wimbledon finalist Serena Williams never left the game at all

హైదరాబాద్: ఓ బిడ్డకు జన్మనిచ్చి.. తల్లిగా టోర్నీలో అడుగుపెట్టిన తర్వాత తనలో పవర్‌ తగ్గిందంటూ విమర్శలు గుప్పించారు. వారందరి నోటికి తాళం వేస్తూ సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్‌లో విజృంభించింది. ఈ సూపర్‌ మామ్‌ రికార్డుస్థాయిలో మొదటి గ్రాండ్‌స్లామ్‌ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇలా.. పదోసారి ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ వేదికపై ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆరంభం నుంచి దూకుడుతో ఆడి

ఆరంభం నుంచి దూకుడుతో ఆడి

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో 25వ సీడ్‌ సెరెనా 6-2, 6-4తో 13వ సీడ్‌ జూలియా జార్జెస్‌ (జర్మనీ)ను చిత్తుచేసింది. ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన సెరెనా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 70 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించింది. దీంతో ఓపెన్‌ ఎరాలో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పెద్ద వయసు క్రీడాకారిణిగా సెరెనా (36 ఏళ్ల 291 రోజులు) నిలిచింది.

అమీతుమీ తేల్చుకోవడానికి ఫైనల్లో సెరెనాతో కెర్బర్‌

అమీతుమీ తేల్చుకోవడానికి ఫైనల్లో సెరెనాతో కెర్బర్‌

రికార్డు స్థాయిలో పదోసారి వింబుల్డన్‌ ఫైనల్‌ చేరిన సెరెనా శనివారం తుదిపోరులో పదకొండో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ)తో తలపడనుంది. 5 ఏస్‌లు సంధించిన సెరెనా.. 16 విన్నర్‌లు కొట్టింది. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన సెరెనా శనివారం జరిగే ఫైనల్లో మాజీ ప్రత్యర్థి ఏంజెలికా కెర్బర్‌ (జర్మనీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. మాజీ నంబర్‌ వన్‌ కెర్బర్‌ రెండేళ్ల క్రితం ఇక్కడ తుదిపోరులో సెరెనాకే టైటిల్‌ చేజార్చుకుంది.

ఫెదరర్ తప్పుకోవడంతో.. నాదల్ పని సులువైంది:

ఫెదరర్ తప్పుకోవడంతో.. నాదల్ పని సులువైంది:

పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ క్వార్టర్స్‌లో నిష్క్రమించడంతో రఫెల్‌ నాదల్ టైటిల్‌కు మార్గం సులువైంది. క్వార్టర్స్‌లో రెండోసీడ్‌ నడాల్‌ 7-5, 6-7(7), 4-6, 6-4, 6-4తో డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై నెగ్గి సెమీస్‌ చేరాడు. జొకోవిచ్‌తో నాదల్ సెమీస్‌ ఆడనున్నాడు. మరో సెమీ్‌సలో కెవిన్‌ అండర్సన్‌తో జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) తలపడతాడు.

Story first published: Friday, July 13, 2018, 11:21 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X