న్యూఢిల్లీ: డిసెంబర్‌లో భారత్‌లో జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఆడేందుకు తహతహలాడుతున్నానని టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఆడేందుకు రోజర్ ఫెదరర్ భారత్‌కు రానున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏస్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. భారత్ జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ కోసం డిసెంబర్ 6 నుంచి 8 వరకు భారత్‌లోనే రోజర్ ఫెదరర్ ఉంటాడు.
ఈ సందర్బంలో రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ నేను నమ్మలేకపోతున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇంతకాలానికి భారత్‌కు వెళ్లగలుగుతున్నా. సంస్కృతి, భాష పరంగా, ఆహార అలవాట్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నానని అన్నారు.

"భారతీయులతో మాట్లాడేటప్పుడు వారిలో తమ దేశం పట్ల ప్రేమను చూశా. చాలా గొప్పగా అనిపించింది. భారత్‌కు గొప్ప చరిత్ర ఉంది" అని రోజర్ ఫెదరర్ అన్నాడు. "భారత్‌లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం. భారత్‌లో ఆడాలన్నిది నా కల. నా భారత పర్యటన ఒక్క టెన్నిస్ పరిమితం కాదని... అంతకు మించి" అని చెప్పారు.
భారత్‌కు రోజర్ ఫెదరర్ రానున్న సందర్బంలో ట్విట్టర్ ద్వారా భారత్‌లో చూడదగ్గ ప్రదేశాలను తెలియజేయాల్సిందిగా అభిమానులు కోరగా.. వారు ఈ క్రింది విధంగా ఫెదరర్ ఇమేజిలను ఫోటోషాప్‌లో జోడించి ట్వీట్ చేశారు.
ఈ లీగ్ కోసం భారత్‌కు వస్తున్న రోజర్ ఫెదరర్... క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కలసే అవకాశం ఉందని రోజర్ ఫెదరర్ ఏజెంట్ టోనీ గాడ్సిక్ తెలిపాడు. ఇంతకుముందు వింబుల్డన్ సందర్భంగా సచిన్, ఫెదరర్ రెండుసార్లు కలిశారని గాడ్సిక్ చెప్పాడు.