Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డోపీగా రష్యా భామ షరపోవా: ప్రపంచ టెన్నిస్‌లో ఒంటరేనా?

లాస్ ఏంజెల్స్: ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం, ఐదుసార్లు గ్రాండ్ స్లామ్‌లతో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు గెలిచిన రష్యా టెన్నిస్‌ క్రీడాకారిణి మారియా షరపోవా ప్రపంచ టెన్నిస్‌లో ఒంటరిదేనా? అంటే అవుననే అంటున్నారు క్రీడా నిపుణులు.

17 ఏళ్ల వయసులోనే ఆమె వింబుల్డన్‌ను గెలిచింది. అతి చిన్న వయసులో రాకెట్ చేతపట్టిన ఆమెకు ప్రపంచ టెన్నిస్ క్రీడాకారుల్లో ఏ ఒక్కరూ స్నేహితులు లేకపోవడం గమనార్హం. ఈ కారణం చేతనే డోపింగ్ వివాదంలో చిక్కుకున్న షరపోవాకు తోటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్నేహితులంటున్నారు.

తనఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మారియా షరపోవాకు టెన్నిస్‌లో స్నేహితులే లేరంటున్నారు ప్రముఖ క్రీడాకారిణి క్రిస్‌ ఎవర్ట్‌. షరపోవా ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదని, తోటి ఆటగాళ్లతో అంత సాన్నిహిత్యం కూడా ఆమెకు ఉండేది కాదన్నారు.

Is Maria sharapova single in world tennis?

ఈ కారణం చేతనే ఇటీవల డోపింగ్ వివాదం బయటపడిన తర్వాత ఏ ఒక్క టెన్నిస్ క్రీడాకారుడు ఆమెకు మద్దతు తెలపలేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ టెన్నిస్ తాజా పరిణామాలను చూస్తుంటే ఈ విషయం నిజమేనని షరపోవా స్నేహితులు చెబుతున్నారు.

నిజానికి షరపోవాకు ఎవరైన స్నేహితులు ఉన్నారంటే వారంతా టెన్నిస్‌తో సంబంధం లేని వారు మాత్రమేనని అంటున్నారు. రష్యాకు చెందిన షరపోవా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌ సమయంలో వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(డబ్ల్యూఏడీఏ) నిర్వహించిన పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

దీంతో ఈ డ్రగ్స్ తాను పదేళ్లుగా (2006 నుంచి) తీసుకుంటున్నానని, దానిని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా తెలిపింది. డోపీగా తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మార్చి 12 నుంచి తాత్కాలిక సస్పెన్షన్‌ అమలులోకి వచ్చింది.

జనవరి 26న నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో షరపోవా ఫెయిల్‌ అయినట్లు అంతర్జాతీయ టెన్సిస్‌ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ విషయాన్ని మార్చి 2న షరపోవాకు తెలిపినట్లు సమాఖ్య స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ టెన్నిస్‌ క్రీడాకారులంతా షరపోవాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనని రఫెల్‌ నాదల్‌ సహా పలువురు ఆటగాళ్లు వ్యాఖ్యానించారు.

మరోవైపు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడి వేటుకు గురైన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆయన ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ బుధవారం స్పందించారు. క్రీడలను రాజకీయం చేస్తున్నారన్నారు. క్రీడలను కొన్ని రకాల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.

క్రీడలకు ఇది ఏ మాత్రం మేలు చేయదన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. షరపోవా విషయంలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నామని, కానీ ఈ విషయాన్ని ఈ విధంగా ప్రచారం చేసి ఉండాల్సింది కాదన్నారు. మరోవైపు, డోప్ టెస్టులో విఫలమైన షరపోవాను క్షమించరాదని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) అధ్యక్షులు డిక్ పౌండ్ అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+