న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూనియర్‌తో ప్రేమలో పడ్డ పేస్: డేటింగ్ కూడా?

న్యూఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండ‌ర్ పేస్ లేటు వ‌య‌సులో మ‌రోసారి ప్రేమలో ప‌డ్డాడా? అంటే ఔననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రేమలో ముగినిపోయిన పేస్.. ఆ జూనియ‌ర్ టెన్నిస్ ప్లేయ‌ర్‌తోనే డేటింగ్ చేస్తున్నాడట.

ఆమే ఐటీఎఫ్ ప్లేయ‌ర్ త‌న్వీ షా. ఇప్పటికే వీరిద్దరూచెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారట‌. 43 ఏళ్ల పేస్‌.. 25 ఏళ్ల త‌న్వీ ప్రేమాయణం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

త‌న్వీ ఈ మ‌ధ్య చండీగ‌డ్‌లో జ‌రిగిన పేస్ డేవిస్ క‌ప్ మ్యాచ్ చూడ‌టానికి కూడా వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి ప్రేమ గురించి తెలిసిన ఓ వ్య‌క్తి మీడియాకు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

Is Leander Paes in love again?

'త‌న్వీ, పేస్ ఒక‌రంటే మ‌రొక‌రు ఇష్ట‌ప‌డుతున్నారు. కానీ, ఇప్పుడే ఆ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌డం వారికి ఇష్టం లేదు. ప్ర‌స్తుతం ఆట‌పైనే దృష్టిసారించిన పేస్ వ‌ర‌ుస టోర్నీల‌తో బిజీగా ఉన్నాడు' అని ఆ వ్య‌క్తి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కాగా, లియాండ‌ర్ మొద‌టి భార్య‌, మోడ‌ల్ రియా పిళ్లైతో ఇప్ప‌టికే తెగ‌దెంపులు చేసుకున్నాడు. వాళ్లిద్ద‌రూ త‌మ కూతురిని ఎవ‌రు చూసుకోవాలనే విష‌యంపై కోర్టును ఆశ్రయించారు. ప్ర‌స్తుతం ఆ కేస్ ఇంకా న‌డుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X