
హైదరాబాద్: ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచిన సెరెనా విలియమ్స్ అనంతరం తాను గర్భవతి అని చెప్పి తన అభిమానులకు షాకిచ్చింది. రెడ్డిట్ వెబ్‌సైట్ కో ఫౌండర్ అయిన అలెక్సిస్ ఒహనియన్‌తో సెరెనా ప్రేమలో మునిగి తేలిన సెరెనా అనంతరం సెప్టెంబర్ 1, 2017న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
పాప పేరు అలెక్సిస్ ఒలింపియా. ఆ తర్వాత నవంబర్‌లో అమెరికాలోని న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్ సెంటర్‌లో వైభవంగా జరిగిన పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలో పాప్ సంగీతంతో హోరెత్తించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.