హైదరాబాద్: పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్లు దూసుకెళ్తున్నారు. భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌తోపాటు పీవీ సింధు, సాయిప్రణీత్, శ్రీకాంత్, ప్రణయ్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మొదటి రౌండ్‌లో సింధు, సైనా అద్భుత ప్రదర్శన చేశారు.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా 21-14, 11-21, 21-10తో లైన్ హోజ్‌మార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలుపొందగా, సింధు 21-19, 21-18తో బీట్‌రిజ్ కొరాలెస్ (స్పెయిన్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్ 21-13, 21-23, 21-19తో ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు.

మరోవైపు హెచ్‌ఎస్ ప్రణయ్ 21-15, 21-17తో లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించారు. మరోవైపు పారుపల్లి కశ్యప్ 23-21, 18-21, 17-21తో జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక రెండో రౌండ్‌లో జపాన్‌కి చెందిన సయాక టకహషితో సింధు తలపడనుంది.
ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే రెండో రౌండ్‌లో హాంగ్ కాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ కూడా రెండో రౌండ్‌కి చేరుకుంది. రెండో రౌండ్‌లో డెన్మార్క్ జోడి మాడ్స్ కొన్రాడ్ పీటర్సన్, మాడ్స్ పీలర్ కోల్డింగ్‌లతో తలపడనుంది.