హైదరాబాద్: ఏటీపీ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో భారత పోరు ముగిసింది. మహిళల డబుల్స్ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో సానియా జోడీ ఓటమి పాలైంది. సానియా మిర్జా, బార్బోరా స్టైకోవా జోడీపై మార్టినా హింగిస్- చాన్ జోడీ 4-6, 4-6 తేడాతో విజయం సాధించింది.
20 నిమిషాల పాటు హోరాహోరీగా మ్యాచ్ సాగింది. రెండు సెట్ల మ్యాచ్‌లో మార్టినా హింగిస్ జోడీ సానియా జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. హింగిస్ జోడీ 14 బ్రేకింగ్ పాయింట్లలో ఏడింటిని తమకు అనుకూలంగా మార్చుకోగా, సానియా జోడీ 10 బ్రేకింగ్ పాయింట్లలో ఐదింటిని మాత్రమే సొంతం చేసుకోగలిగింది.
తొలి సెట్‌లో కీలక సమయాల్లో సర్వీసు సానియా జోడీ నిలుపుకోలేకపోయింది. గతంలో హింగిస్, సానియా అనేక మ్యాచ్‌ల్లో జోడీగా ఆడినప్పటికీ, ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్ధులుగా తలపడ్డారు.