55 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత జట్టు

కోల్‌కతా: డేవిస్‌కప్ కోసం 55 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోతోంది. 1964 తర్వాత భారత డేవిస్‌కప్ జట్టు పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. డేవిస్ కప్‌లో భాగంగా జట్టు పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్టు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సెక్రెటరీ జనరల్ హిరణ్మయ్ ఛటర్జీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత క్రికెట్ జట్టు చివరి సారిగా 2007లో పాకిస్థాన్‌లో పర్యటించింది. తరువాత దేశంలోని ఏ క్రీడలోనూ ఏ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించలేదు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

కచ్చితంగా పాకిస్థాన్ వెళ్లాలి:
హిరణ్మయ్ ఛటర్జీ మాట్లాడుతూ... 'డేవిస్‌కప్ ద్వైపాక్షిక సిరీస్ కాదు. క్రికెట్ మాదిరి టెన్నిస్‌కు ఇది ప్రపంచకప్ లాంటిది. మేం కచ్చితంగా పాకిస్థాన్ వెళ్లాలి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చార్టర్‌కు కట్టుబడి ఉండాలి. పాకిస్థాన్ వెళ్లకపోతే.. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య భారత్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. జట్టుతో పాటు సహాయక సిబ్బంది, కోచ్ పాకిస్థాన్ వెళతారు' అని ఛటర్జీ తెలిపారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చించలేదు అని ఆయన చెప్పారు.

1964 తర్వాత ఇదే తొలిసారి:
సెప్టెంబర్ 14న ఇస్లామాబాద్ వేదికగా భారత్-పాక్ మధ్య ఆసియా, ఓసియానియా గ్రూప్ సమరం ప్రారంభం కానుంది. 1964 తర్వాత భారత డేవిస్‌కప్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. చివరిగా అక్కడ ఆడినప్పుడు భారత్ 4-0తో విజయం సాధించింది. డేవిస్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

వచ్చే నెల 5న ఎంపిక:
డేవిస్‌కప్ ర్యాంకింగ్స్‌లో భారత్ 20వ స్థానంలో ఉండగా.. పాక్ 37వ ర్యాంకులో కొనసాగుతోంది. కెప్టెన్‌గా మహేశ్ భూపతి, కోచ్‌గా జీషన్ అలీల పదవీకాలం ముగిసినప్పటికీ.. డేవిస్‌కప్ వరకు కొనసాగనున్నారు. పాకిస్థాన్ వెళ్లబోతున్న భారత జట్టును వచ్చే నెల 5న ఎంపిక చేయనున్నారు. గత ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఇటలీతో తలపడిన జట్టే దాదాపు బరిలోకి దిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications