Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటిల్ పోరు.. తుదిమెట్టుపై బోల్తా పడిన సాకేత్ రామ్‌ జోడీ

చెన్నై ఓపెన్‌ ఏటీపీ ఏటీపీ ఛాలెంజర్‌ 100లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆంధ్ర టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని - రామ్‌కుమార్‌ రామనాథన్‌ ద్వయంకు ఫైనల్ లో నిరాశ ఎదురైంది. ఈ సీజన్ లో వీరిద్దరు డబుల్స్ టైటిల్ పోరులో ఓటమిని అందుకున్నారు. దీంతో ఈ భారత ద్వయం రన్నరప్ తో సరిపెట్టుకుంది.

టైటిల్ వేటలో చివరి మెట్టుపై బోల్తా పడిన సాకేత్‌ మైనేని - రామ్‌ కుమార్‌ రామనాథన్‌ 4-6, 4-6తో ఈ పరాజయం అందుకున్నారు. 4-6, 4-6 తేడాతో జపాన్‌కు చెందిన మొచిజుకి, యూసుగి జోడీపై ఓటమి చెందారు. ఈ తుది పోరులో భారత ద్వయం రెండు సార్లు సర్వీసును చేజార్చుకుంది.

Indian duo Defending champions Ramkumar Ramanathan and Saketh Myneni loss in Chennai Open 2025 finals

ఈ ఫైనల్ మ్యాచ్ లో జపాన్‌ ద్వయం ఆరంభం నుంచే దూకుడుగా ఆడి.. భారత ప్లేయర్లపై పైచేయి సాధించింది. దీంతో ప్రత్యర్థి జోడీ.. తొలి సెట్‌ లో ఈజీగానే గెలిచింది. అనంతరం రెండో సెట్‌లోనూ భారత జోడీ పుంజుకోలేకపోవడంతో జపాన్ ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో మొచిజుకి, యూసుగి జోడీ చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కాగా, గత సీజన్ లో భారత ద్వయం ఈ డబుల్స్ టైటిల్‌ సాధించింది. పైగా ఈ సారీ టైటిల్‌ వేటలో నిలవడంతో భారతే విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరి మెట్టుపై బోల్తా పడడంతో ప్రత్యర్థి ద్వయంకు టైటిల్ దక్కింది. ఇక సాకేత్‌-రామ్‌ కుమార్‌ జోడీ నెక్ట్స్.. ఈ నెల 17 నుంచి పుణే వేదికగా జరిగే ఏటీపీ ఛాలెంజర్‌ టోర్నమెంట్‌ ఆడనుంది.

Story first published: Sunday, February 9, 2025, 8:03 [IST]
Other articles published on Feb 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+