India vs Pakistan Davis Cup: కెప్టెన్ మార్పు వివాదం, బోపన్న ధ్వజం, స్పందించిన భూపతి

హైదరాబాద్: భారత్-పాక్ జట్ల మధ్య జరగాల్సిన డేవిస్ కప్ పోరుని తటస్థ వేదికకు మారుస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) సోమవారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో తలపడే భారత డేవిస్‌కప్ జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ టెన్నిస్ సమాఖ్య సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ రోహిత్ రాజ్‌పాల్ నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా) తెలిపింది.
డేవిస్ కప్ పోరుకు కెప్టెన్ మార్పుపై సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న మండిపడ్డాడు. ఆటగాళ్లను సంప్రదించకుండా మహేశ్ భూపతి స్థానంలో రోహిత్ రాజ్‌పాల్‌ను నాన్-ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారని భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా)ను ప్రశ్నించాడు.

భూపతి అంగీకరించకపోవడంతో
దీనికి కొందరు ఆటగాళ్లతో పాటు నాన్-ప్లేయింగ్ కెప్టెన్ భూపతి అంగీకరించకపోవడంతో అతడి స్థానంలో వేరొకరిని నియమించాలన్న నిర్ణయానికి ఏఐటీఏ వచ్చింది. ఆ తర్వాత భారత ఒత్తిడికి తలొగ్గి తటస్థ వేదికలో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఐటీఎఫ్ అంగీకరించినప్పటికీ ఇప్పుడు కెప్టెన్‌ను మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మండిపడ్డ రోహాన్ బోపన్న
దీంతో సీనియర్ ఆటగాడు రోహాన్ బోపన్న మాట్లాడుతూ "మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహిస్తారో ఇంకా ఐటీఎఫ్ వెల్లడించకుండానే ఏఐటీఏ కెప్టెన్‌ను మార్చడం ఆశ్చర్యం కలిగించింది. మా ఆటగాళ్లలో ఎవరినీ సంప్రదించకుండానే కెప్టెన్‌ను మారుస్తున్నట్లు చెప్పడం నన్ను షాక్‌కు గురి చేసింది" అని అన్నాడు.

బోపన్న వ్యాఖ్యలపై ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి ఇలా
ఈ నేపథ్యంలో రోహాన్ బోపన్న వ్యాఖ్యలపై ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ మాట్లాడుతూ "ఆటగాళ్ల పని కేవలం ఆడటం మాత్రమే.ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బోపన్న ఎవరు? రేప్పొద్దున నన్నెందుకు కెప్టెన్‌ని చేయలేదని కూడా అతను అడుగుతాడు. ఈ విషయంలో అతడి జోక్యం అనవసరం" అని అన్నాడు.
ట్విట్టర్‌లో స్పందించిన మహేశ్ భూపతి
ఈ వివాదంపై మషేశ్ భూపతి తన ట్విట్టర్‌లో "నా ఆలోచనలు మరియు వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ... నాకు తెలుసు, సోమవారం మిస్టర్ చటర్జీతో ఫోన్‌లో మాట్లాడాను. రోహిత్ కెప్టెన్‌గా నా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడని నాకు చెప్పారు. ఎందుకంటే నేను పాకిస్తాన్ వెళ్ళడానికి సౌకర్యంగా లేను (ఇంతకు ముందు ఆ దేశాన్ని ప్రేమించాను - ఈసారి కాదు)" అంటూ ట్వీట్ చేశాడు. పాక్‌తో పోరుకు మాత్రమే నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా రోహిత్ రాజ్‌పాల్ వ్యవహరిస్తాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications