ఆస్ట్రేలియన్ ఓపెన్: టిట్సిపాస్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి రఫెల్ నాదల్

హైదరాబాద్: గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ టిట్సిపాస్ సంచలన ప్రదర్శన సెమీస్‌తో ఆగిపోయింది. క్వార్టర్స్‌లో దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ను కంగు తినిపించిన టిట్సిపాస్... సెమీస్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ చేతిలో చిత్తుగా ఓడాడు. గురువారం రాడ్ లెవర్ ఎరీనాలో జరిగిన తొలి సెమీఫైనల్లో 32 ఏళ్ల నడాల్ 6-2, 6-4, 6-0 స్కోరుతో 20 ఏళ్ల టిట్సిపాస్‌ను చిత్తు చేశాడు.
ఈ విజయంతో పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ వేటలో నిలిచాడు. నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన నాదల్, ఫైనల్లో విజయం సాధిస్తే... ఓపెన్ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఓపెన్ శకంలో ఈ ఘనత ఇప్పటి వరకూ ఏ ఆటగాడూ అందుకోలేదు.
ఆదివారం జరగనున్న ఫైనల్లో టాప్‌సీడ్ జొకోవిచ్-లుకాస్ పౌలీ (ఫ్రాన్స్) మధ్య జరిగే మ్యాచ్ విజేతతో రఫెల్ నాదల్ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండో సెమీస్ శుక్రవారం జరగనుంది.

గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో
తొలి సెమీస్ మ్యాచ్‌లో నాదల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం నాదల్ తన దూకుడు కొనసాగించాడు. ఏకంగా 28 విన్నర్లు సంధించిన నడాల్ ఆరుసార్లు స్టెఫనోస్ సర్వీ్‌సను బ్రేక్ చేయడం విశేషం. అంతేనా కేవలం ఒక బ్రేక్‌పాయింట్ మాత్రమే నాదల్ కాచుకోవడం గమనార్హం.

63 గేమ్‌లలో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోలేదు
ఫైనల్ చేరే క్రమంలో వరుసగా 63 గేమ్‌లలో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోకపోవడం విశేషం. తొలి సెట్ మూడో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన ధాటిని మొదలు పెట్టిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్‌లతో 4-2తో ముందంజ వేశాడు. రెండు డబుల్ ఫాల్ట్‌లతో పాటు పేలవ డ్రాప్‌షాట్‌లతో సిట్సిపాస్ తొలి సెట్‌లో పూర్తిగా వెనుకబడ్డాడు.

మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఫామ్
ఇక, రెండో సెట్‌లో మాత్రం కొంత పోటీనిచ్చిన గ్రీక్ ఆటగాడు 4-4 వరకు సమంగా నిలిచాడు. అయితే బ్రేక్ సాధించిన నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఆటతో మూడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్ తన ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్‌కు ఒక్క గేమ్ కూడా ఇవ్వలేదు.

టిట్సిపాస్‌పై ప్రశంసలు
మ్యాచ్‌లో ఇద్దరూ చెరో ఐదు ఏస్‌లు సంధించగా.. టిట్సిపాస్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్ 28 విన్నర్లు కొట్టగా, సిట్సిపాస్ 17కే పరిమితమయ్యాడు. మ్యాచ్ అనంతరం టిట్సిపాస్‌ను నడాల్ ప్రశంసల్లో ముంచెత్తాడు. "పలు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గే సత్తా అతడికి ఉంది" అని నాదల్ జోస్యం చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications