Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది సరిపోదు, ఎంజాయ్ చేస్తున్నంత కాలం: సానియా మీర్జా

హైదరాబాద్: నెంబర్ వన్ స్థానం దక్కించుకొని, పలు డబుల్ గ్రాండ్ స్లామ్స్ గెలిచిన సానియా మీర్జా.. తాను మరిన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచాకనే రిటైర్మెంట్ పైన ఆలోచిస్తానని చెప్పారు.

టెన్నిస్ ఆడటం అంటే తనకు ఎంతో ఇష్టన్నారు. ప్రాక్టీస్ చేయడం అంటే చాలా ఇష్టమన్నారు. తాను హార్డ్ వర్క్ చేస్తానని చెప్పారు. పోటీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.

తాను ఆటను ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆడుతానని చెప్పారు. తాను మరెన్నో సాధించాలనుకుంటున్నానని చెప్పారు. ఇదే సరిపోదన్నారు.

సానియా మీర్జా

సానియా మీర్జా

రోజర్ ఫెదరర్ ఇంకా ఆడుతున్నారని, ప్రతి ఒక్కరు ఆడాలన్నారు. తాను రిటైర్మెంట్ అయ్యేలోగా మరిన్ని గ్రాండ్ స్లామ్స్ గెలవాలన్నారు. త్వరలో పెద్ద టోర్నమెంట్స్ ఉన్నాయన్నారు.

సానియా మీర్జా

సానియా మీర్జా

తాను ఆదివారం రాత్రి స్టగర్ట్ వెళ్తున్నానని చెప్పారు. 2010లో తన కెరీర్ ముగిసిందని భావించానని గుర్తు చేశారు. తన పెళ్లి తర్వాత ఎన్నో జరిగాయన్నారు. తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.

సానియా మీర్జా

సానియా మీర్జా

పెళ్లైన కొద్ది రోజులకు.. తన భర్త మళ్లీ ఎందుకు ఆడవు అని ప్రశ్నించారని, తాను వింబుల్డన్‌కు వెళ్లి కప్ గెలిచానని చెప్పారు. అప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

 సానియా మీర్జా

సానియా మీర్జా

ఫెడ్ కప్‌లో తాను తొలిసారి ఆడినప్పుడు భారత జట్టు బలహీనంగా ఉండేదని, ఇప్పుడు బలమైన జట్టుగా తయారయిందన్నారు.

సానియా మీర్జా

సానియా మీర్జా

చాలామంది యువ క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారని చెప్పారు. భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు.

 సానియా మీర్జా

సానియా మీర్జా

తొమ్మిదేళ్ల క్రితం లాల్ బహదూర్ స్టేడియంలో ఆడానని, మళ్లీ నెంబర్ 1గా ఇక్కడ అడుగు పెట్టడాన్ని తాను ఎప్పుడు మరిచిపోలేనని చెప్పారు. కాగా, సానియా మీర్జా భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ గురువారం నాడు తెలంగాణఅ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+