For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు కోసమే టెన్నిస్ ఆడుతున్నా: బెర్నార్డ్ వివాదాస్పదం

By Nageshwara Rao

హైదరాబాద్: వివాదాస్పద ఆస్ట్రేలియన్ టెన్నిస్ యువ ఆటగాడు బెర్నార్డ్ టోమిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కేవలం డబ్బు కోసమే తాను టెన్నిస్ ఆడుతున్నానని, ఆటంటే ఇష్టమే తప్ప ప్రత్యేకమైన ప్రేమ లేదని తేల్చి చెప్పాడు. ఆదివారం రాత్రి ఓ ఆస్ట్రేలియన్ టీవీ ఛానెల్‌కి ఇంటర్యూలో టోమిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దీంతో టోమిక్ తీరు టెన్నిస్‌కు తలవంపులు తెచ్చేలా ఉందని విమర్శిస్తూ అతని ఇంటిముందు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

'మీరంతా రావొద్దు. టీవీల్లో కూర్చొని టెన్నిస్ చూడండి. పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. 'నా కెరీర్ మొత్తంలో 100 శాతం ఆటను ప్రదర్శించాను. కొన్ని సందర్భాల్లో 30 శాతం ఆటను ప్రదర్శించాను. ఇంకా నేను అలసిపోలేదు. ఇప్పటిదాక ఏదైతే ఆడానో అది అద్భుతం' అని అన్నాడు.

'I'm trapped': Bernard Tomic says he's only playing tennis for the money

అంతేకాదు తాను చాలా పేదరికం నుంచి వచ్చానని చెప్పిన టోమిక్ డబ్బు సంపాదనే తన ధ్యేయమని చెప్పాడు. 'టెన్నిస్ ఆడొద్దు. మీరు దేనినైతే ప్రేమిస్తారో దానిని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే టెన్నిస్ నిజంగా ఎంతో కష్టం. ప్రస్తుతం నా పరిస్థితి వేరు. నేను చిక్కుకున్నా. నేను ఇక తప్పక ఆడాల్సిందే' అని అన్నాడు.

టెన్నిస్ తనను ఎంచుకుందని, అందుకేనేమో నేను టెన్నిస్‌ని ఎప్పుడూ అమితంగా ప్రేమించలేదని చెప్పాడు. ఇటీవల వింబుల్డన్ తొలిరౌండ్‌లో బోర్‌కొట్టడంతోనే ఓడిపోయానని టోమిక్ వి వాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిపై నిర్వాహకులు 51వేల డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+