Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రైవేట్ వ్యక్తిని, నాపై సినిమా ఇష్టం లేదు: సానియా

న్యూఢిల్లీ: తన జీవితకథను సినిమాగా తీయడం తనకు ఇష్టం లేదని టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అన్నారు. తాను వాస్తవ జీవితంలో తాను ప్రైవేట్ వ్యక్తిని అని, అందువల్ల తన జీవితకథను తెరపై చూడడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. ఇండియన్ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ బాలల చలనచిత్రోత్సవ వేడుకల్లో ఆమె ఆ విధంగా అన్నారు.

సినిమా కోసం తన ప్రైవేట్ జీవితాన్ని పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని, తన జీవితాన్ని ఆధారం చేసుకుని ఎవరైనా సినిమా తీస్తే దీపికా పడుకునే తన పాత్రను ధరిస్తే బాగుంటుందని ఆమె చెప్పారు. క్రీడాకారుల జీవితకథలను తెరపైకి ఎక్కిస్తున్న నేపథ్యంలో ఈ విషయం సానియా మీర్జా వద్ద ప్రస్తావనకు వచ్చింది.

 I'm a private person, don't want a film to be made on me: Sania Mirza

"నేను ప్రైవేట్ వ్యక్తిని. నాపై సినిమా తీయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకే సంబంధించిన విషయాలను కొన్నింటిని నేను పంచుకోవడానికి సిద్ధంగా లేను. నేను అలా పంచుకునే వ్యక్తిని కాను. నా జీవితకథను సినిమా తీస్తామని గతంలో కూడా కొంత మంది అడిగారు. నేనే వద్దన్నాను" అని ఆమె వివరించారు.

తనను ఎవరైనా స్పాట్‌లో పెడితే తాను ఎన్నుకోవాల్సి ఉంటుందని, అప్పుడు తన పాత్రకు దీపికా పడుకోనేను ఎన్నుకుంటానని సానియా చెప్పారు. 28 ఏళ్ల సానియా మీర్జా ప్రస్తుతం తన ఆత్మకథ రాస్తున్నారు. అగైనెస్ట్ ఆల్ ఆడ్స్ అనే తాత్కాలికంగా దానికి పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో దియా మీర్జా, దివ్యా దత్తు తదితరులు పాల్గొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+