కరాచీ: పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో తన వివాహ బంధంలో చీలిక వచ్చినట్లు వచ్చిన వార్తలను హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా ఖండించారు. తమ వివాహ బంధంపై వచ్చిన వార్తలపై ఆమె నోరు విప్పారు. తమ మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పారు.
షోయబ్‌కు తాను దూరంగా ఉంటున్నట్లు వచ్చిన మీడియా వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. తామిద్దరం అన్యోన్యంగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు. పాకిస్తాన్‌లోని షోయబ్ సొంత ఊరు సియాల్‌కోట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె తన వివాహబంధంపై మాట్లాడారు. తాము ఇరువురం వేర్వేరు దేశాలకు చెందినవారమని, ఇద్దరమూ క్రీడాకారులం కావడంతో తమపై ఒత్తిడి ఉంటుందని ఆమె చెప్పారు. అలాంటి సమస్యలను అధిగమిస్తున్నట్లు ఆమె తెలిపారు.
షోయబ్‌కూ తనకూ మధ్య ఏ విధమైన విభేదాలు లేవని సానియా స్పష్టం చేశారు. తన భర్తతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు సియాల్‌కోట్‌కు వచ్ిచనట్లు ఆమె తెలిపారు.