Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియాను మిస్సవుతున్నా: షోయబ్, 'జూనియర్ మాలిక్'పై వ్యాఖ్య

హైదరబాద్: తాను తన భార్య సానియా మీర్జాతో ఉండేందుకు సమయం చిక్కడం లేదని, ఆమెను తాను చాలా మిస్ అవుతున్నానని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నారు. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుతో చరిత్ర సృష్టించిన సానియా తన సొంత దేశం భారత్‌కే కాదు, అత్తగారిల్లు పాకిస్తాన్‌కు కూడా గర్వకారణమని మాలిక్ చెప్పిన విషయం తెలిసిందే. నెంబర్ వన్‌గా సానియా అయినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు.

జూనియర్ మాలిక్ పైన షోయబ్

షోయబ్ మాలిక్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. త్వరలో జూనియర్ మాలిక్ రాబోతున్నారని ట్వీట్ చేశారు. సానియా మీర్జా త్వరలో అమ్మ అవుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్విట్టర్‌లో పలువురి ప్రశ్నలకు షోయబ్ సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా ఒకరు... 'జూనియర్ మాలిక్ ఎప్పుడు వస్తాడు' అని ప్రశ్నించారు. దీనిపై షోయబ్ మాలిక్ స్పందిస్తూ.. త్వరలో వస్తాడు అని చెప్పారు. కాగా, సానియాతో పెళ్లికు ముందు తాను ప్రేమించానని చెప్పారు. తాను క్రికెటర్‌ను అయి ఉండకపోతే సానియాకు మేనేజర్ అయి ఉండేవాడినని వ్యాఖ్యానించారు.

 I am not with my wife Sania Mirza, I miss her a lot: Shaoaib Malik

కాగా, మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌తో చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సొంత దేశం భారత్‌కే కాదు, అత్తగారిల్లు పాకిస్థాన్‌కూ గర్వకారణమంటున్న విషయం తెలిసిందే. స్విస్ వెటరన్ స్టార్ హింగిస్‌తో కలిసి సానియా.. ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో విజేతగా నిలిచి వరల్డ్‌నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన మాలిక్, సానియా ప్రదర్శనను చూసి తాను చాలా గర్వపడుతున్నాని తెలిపాడు. ఆమె భారతదేశానికి ప్రాతినిథ్యం వస్తున్నప్పటికీ.. తన భార్య కావడం వల్ల ఇది పాకిస్థాన్ గౌరవానికి కూడా సంబంధించిన అంశమేనని చెప్పాడు.

అంతర్జాతీయ వేదికలపై అద్భుతరీతిలో రాణిస్తూ సానియా సాధిస్తున్న విజయాలు భారత్, పాకిస్థాన్ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి అని షోయబ్ పేర్కొన్నాడు. సానియాతో పెళ్లికి ముందు నుంచి తనకు టెన్నిస్ అంటే ఇష్టమని చెప్పిన షోయబ్.. ఇప్పుడు ప్రాణంగా మారిందని తెలిపాడు. తాను ఆమెను చాలా మిస్ అవుతున్నాని, అందుకోసమే ఆమె ఆడుతున్న ప్రతీ మ్యాచును ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తానని చెప్పాడు.

ఆమె గెలుపును తన కుటుంబసభ్యులతో పంచుకుంటానని తెలిపాడు. నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తర్వాత సానియా, సానియా కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పాడు. సానియా విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+