ఇక్కడా సానియానే: రాకెట్ పట్టిన వెంకటేష్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ప్రచారంలో భాగంగా హైదరాబాదులోని మొయినాబాద్ గల సానియా మీర్జా అకాడమీలో గురువారం నిర్వహించిన రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ సందడిగా సాగింది.
దిగ్గజ క్రీడాకారులు మార్టినా నవ్రతిలోవా, లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సానియా-పేస్ జోడీ 6-2, 7-6 (7-3)తో నవ్రతిలోవా-భూపతి ద్వయంపై విజయం సాధించింది.
మొదటి సెట్‌ను అలవోకగా నెగ్గిన సానియా జోడీ రెండో సెట్‌లో మాత్రం కష్టపడాల్సి వచ్చింది. నువ్వా-నేనా అన్నట్టు సాగిన ఈ సెట్ టై బ్రేక్‌కు దారితీసింది. అయితే టై బ్రేక్‌లో అదరగొట్టిన సానియా-పేస్ జోడీ విజయం సాధించింది.

దిగ్గజ క్రీడాకారులు
నలుగురు దిగ్జజ టెన్నిస్ క్రీడాకారులు గురువారం హైదరాబాదులో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల ద్వారా సందడి చేశారు.

హీరో వెంకటేష్
సానియా మీర్జా అకాడమీలో జరిగిన ఐపిటిఎల్ ఎగ్జిబిషన్ మ్యాచును తిలకిస్తూ టాలీవుడ్ హీరో వెంకటేష్ ఇలా కనిపించారు.

లేటు వయస్సులోనూ నవ్రతిలోవా ఇలా..
ఐపిటిఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో దిగ్గజ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా విన్యాసాలు అభిమానులను ఆకట్టుకు న్నాయి. 59 ఏళ్ల లేటు వయసులోనూ ఆమె కోర్టులో యువ ఆటగాళ్లకు దీటుగా చురుకుగా కదలడం ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసింది..

మార్టినా పుషప్స్ ఆకర్షణ
మ్యాచ్ రెండో సెట్ ప్రారంభంలో మార్టినా చేసిన పుషప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక రెండో సెట్‌లో సానియా జోడీ 5-4తో ముం దంజలో నిలిచిన తరుణంలో ఓ సరదా సం ఘటన చోటుచేసుకుంది.

వెంకటేష్...
హీరో వెంకటేష్‌కు క్రీడలంటే ఎక్కడ లేని మక్కువ. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. టెన్నిస్ కోర్టులో ఇలా రాకెట్ పట్టిన వెంకటేష్...

గ్యాలరీలోకి బంతి...
నవ్రతిలోవా బాల్ బా య్‌వైపు విసిరిన బంతి గ్యాలరీలోని వచ్చి పడింది. దీంతో బాల్‌బాయ్‌తో సహా అక్కడున్న ప్రేక్షకులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.

మహేష్ భూపతి ఇలా..
మ్యాచ్ అనంతరం జరిగిన సమావేశంలో ఐపీటీఎల్ వ్యవస్థాపకుడు మహేష్ భూపతి మాట్లాడుతూ డిసెంబర్ 2 నుంచి మొదలయ్యే రెండో అంచెపై దృష్టి సారించానని చెప్పాడు.

పుల్లెల గోపీచంద్, ఇంకా..
బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌తోపాటు సినీ హీరోలు దగ్గుబా టి వెంకటేశ్, రానా తదితరులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.

రెండో సీజన్ కోసం..
ఐపీటీఎల్ విజయవంతమైందని, రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నామని మహేష్ భూపతి అన్నాడు.

నవ్రతిలోవాకు ప్రశంసలు
లెజెండరీ ప్లేయర్ నవ్రతిలోవాతో కలిసి ఆడడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా ఉంటూ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నవ్రతిలోవాకు హ్యాట్సాఫ్ అని మహేష్ భూపతి అన్నాడు.

ముఖ్య అతిథిగా...
కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు టీ సుబ్బరామిరెడ్డి మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications