టెన్నిస్ సూపర్ స్టార్ జకోవిక్‌ను ఓడించిన 19 ఏళ్ల రూన్.. ప్యారిస్ మాస్టర్స్ సొంతం!

టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిక్‌ను 19 ఏళ్ల హోల్గర్ రూన్ ఓడించాడు. ప్యారిస్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన రూన్.. ఫైనల్‌కు తన జర్నీలో ముగ్గురు టాప్ ప్లేయర్లను మట్టికరిపించాడు. టాప్-10లో ఉన్న నలుగురు స్టార్ ప్లేయర్లు హ్యూబర్ట్ హ్యూర్కాజ్, ఆండ్రే రూబ్లెవ్, కార్లోస్ అల్కారెజ్, ఫీలిక్స్ ఆగెర్ అలియాసైమ్‌లను ఓడించాడు.

మ్యాచ్ ఎలా సాగిందంటే..
తొలి సెట్‌లో స్టార్ ప్లేయర్, ఆరుసార్లు ప్యారిస్ ఛాంపియన్ జకోవిక్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. జకో చేసిన ఒక్క సర్వ్‌ను కూడా రూన్ అడ్డుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాతి సెట్‌లో పరిస్థితి తారుమారైంది. రెండో సెట్‌లో తన కాన్ఫిడెన్స్ పొందిన రూన్ విజయం సాధించాడు. ఫైనల్ సెట్‌లో జకో 3-1తో ఆధిక్యం సాధించాడు. అలాంటి సమయంలో జకో తొడ కండరాలు పట్టేయడంతో ఫిజియోను పిలిచాడు. ఆ తర్వాత పుంజుకున్న రూన్ చివరకు ఆ సెట్‌ను 7-5తో ముగించాడు. దీంతో 3-6, 6-3, 7-5 తేడాతో రూన్ ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ తన సొంతం చేసుకున్నాడు.

నా ఐడల్ నువ్వే..
జకోపై సూపర్ విక్టరీ సాధించిన అనంతరం నేలపై పడుకొని రిలీఫ్ పొందిన రూన్.. తర్వాత జకోకు షేక్ హ్యాండిచ్చాడు. 'మీరు నా ఫేవరెట్ ప్లేయర్లలో ఒకరు. చిన్నతనం నుంచి మీ ఆట చూస్తున్నా. మీతో ఇలా కోర్ట్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని రూన్ అన్నాడు. టోర్నమెంట్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశానని, వచ్చే ఏడాది ఇక్కడకు మళ్లీ వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు.

వాళ్లే ఫ్యూచర్..
తనను ఓడించిన రూన్‌ను మెచ్చుకున్న జకోవిక్.. 'నన్ను నువ్వు ఓడించినందుకు నాకు సంతోషంగా లేదు. కానీ నీ వ్యక్తిత్వం, టెన్నిస్‌పై నీకున్న ప్రేమ అంటే నాకిష్టం అందుకు సంతోషంగా ఉన్నా. నువ్వు చాలా కష్టపడ్డావు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. నీ భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉండబోతోంది' అన్నాడు. మ్యాచ్‌కు ముందు కూడా రూన్‌పై ప్రశంసలు కురిపించిన జకో.. రూన్‌ను చూస్తే తనను తాను చూసుకుంటున్నట్లు అనిపించిందన్నాడు. ఈ ఆటకు భవిష్యత్తు రూన్, అల్కారెజ్ వంటి వాళ్లేనని కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications