Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గర్వంగా ఉంది: రెండో ఏడాదీ అగ్రస్థానంతో ముగించిన సిమోనా హలెప్

Halep to end 2018 as world number one

హైదరాబాద్: ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య (డబ్ల్యూటీఏ) మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సిమోనా హలెప్‌ వరుసగా రెండో ఏడాదిని కూడా అగ్రస్థానంతోనే ముగించింది. రొమేనియాకు చెందిన హలెప్ 2018లో 40 వారాల పాటు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగింది.

హలెప్‌ ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వోజ్నియాకి, కెర్బర్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ర్యాంకింగ్స్‌లో వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో ఉన్నందుకు గాను సింగపూర్ వేదికగా జరిగే డబ్ల్యుటీఏ పైనల్స్‌లో హలెప్‌‌కు ట్రోఫీని బహూకరించున్నారు.

ఈ సందర్భంగా హలెప్ మాట్లాడుతూ "గతేడాది లాగే ఈ ఏడాదిని కూడా అగ్రస్థానంతోనే ముగించడం చాలా గర్వంగా ఉంది. రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలవడం నాకు గొప్ప అచీవ్‌మెంట్. ఈ ఏడాది నా కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాను" అని తెలిపింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్‌ తిరిగి అగ్రస్థానాన్ని చేరుకోవడానికి చేరువవుతున్నాడు. షాంఘై ఓపెన్‌లో విజేతగా నిలిచిన జకో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న రఫెల్‌ నాదల్‌ కంటే 215 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు.

Story first published: Tuesday, October 16, 2018, 7:51 [IST]
Other articles published on Oct 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+