చైనా ఓపెన్: షరపోవాకు షాక్, హలెప్ చేతిలో ఓటమి
హైదరాబాద్: చైనా ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న తర్వాత పునరాగమనం చేసిన ప్రతి టోర్నీలో కూడా ఏదో ఒక దశలో షరపోవా ఇంటిబాట పడుతుంది.
తాజాగా చైనా ఓపెన్ మూడో రౌండ్‌లో ఓటమి పాలైంది. రొమేనియాకు చెందిన వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ సిమోనా హలెప్ చేతిలో 6-2, 6-2తో రెండు వరుస సెట్లు కోల్పోయింది. దీంతో చైనా ఓపెన్ నుంచి షరపోవా నిష్క్రమించింది. తాజా విజయంతో హలెప్ గతంలో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది.

డోపింగ్ నిషేధం తర్వాత గత ఏప్రిల్‌లో పునరాగమనం చేసిన మారియా షరపోవా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఇటీవలే న్యూయార్క్ వేదికగా జరిగిన యుఎస్ ఓపెన్‌లో కూడా నాలుగో రౌండ్‌లో లాత్వియాకు చెందిన సెవస్తోవా చేతిలో 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓడిపోయింది.
మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ ముగురుజా టోర్నీ నుంచి తప్పుకోవడంతో చైనా ఓపెన్‌లో హలెప్‌కు అవకాశాలు మరింతగా మెరుగయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications