సానియాకు స్వాగతం: ముద్దాడిన తల్లి (పిక్చర్స్)
హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ మిక్‌సడ్ డబుల్‌స టైటిల్ సాధించి స్వస్థలానికి తిరిగి వచ్చిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. ఆమె రాకను తెలుసుకున్న అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో చేరుకొని ఘనస్వాగతం పలికారు.
టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా తన భాగస్వామి బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్‌లో మిక్‌సడ్ డబుల్‌స టైటిల్‌ను గెల్చుకున్న విషయం తెలిసిందే. యూఎస్ ఓపెన్ మిక్‌సడ్ డబుల్‌స టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రముఖుల నుంచి అభినందనలు వస్తునే ఉన్నాయి.
మొన్న రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ సానియాను ప్రశంసించగా, ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. సానియా విజయం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా చేరారు.

అధికార లాంఛనాలతో...
యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

మెరిసిన సానియా..
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జా శంషాబాద్ విమానాశ్రయంలో మెరిశారు.

కుటుంబ సభ్యులు
సానియా కుటుంబ సభ్యులు నసీమా మీర్జా, ఇమ్రాన్ మీర్జా, ఆనం మీర్జా కూడా విమానాశ్రయానికి వచ్చారు.

పిల్లలకు స్ఫూర్తి సానియా..
టెన్నిస్ క్రీడలో తనదైన విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న సానియా పిల్లలకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ఇలా..

కుటుంబ సభ్యులతో ఇలా...
శంషాబాద్ విమానాశ్రయంలో సానియా మీర్జా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. సానియాను తల్లి ముద్దాడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications