
హైదరాబాద్: జీక్యూ అనే పత్రిక ప్రకటించిన అవార్డులలో ఉమెన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన సెరెనా విలియమ్స్.. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. అమెరికన్ టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ కవర్‌ఫోటో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జెంటిల్‌మెన్స్ క్వార్టర్లీ (జీక్యూ) మ్యాగజైన్ యేటా అవార్డులను ప్రకటిస్తుంది. సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్, ఫ్యాషన్, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాల్లో యువతను ప్రభావితం చేసిన వారికి అవార్డ్స్ అందిస్తుంది.
1996 నుంచి జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను ప్రతీ యేడాది ప్రకటిస్తుంది. కానీ, ఈ యేడాది 2018 సంవత్సరానికి ప్రకటించిన అవార్డులలో ప్రత్యేకత ఉంది. క్రీడారంగం నుంచి సెరెనా విలియమ్స్ ఈ అవార్డ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. క్రీడా విభాగం నుంచి ద ఛాంపియన్‌గా సెరెనా ఎంపికైంది. ఈ కవర్‌పేజ్ కోసం టెన్నిస్ క్వీన్ హాట్ హాట్ ఫోజులిచ్చింది.
మ్యాగజైన్‌ను ఉమన్ ఆఫ్ ద ఇయర్ అనే కొటేషన్‌తో సెరెనా ఫోటో పక్కన రాస్తూ ప్రచురించారు. దాంతో పాటుగా మెన్ అనే పదాన్ని కొట్టేసినట్లుగా దానికి బదులు ఉమన్ అనే పదాన్ని హైలైట్ చేస్తూ కొటేషన్స్‌లో పెట్టి ప్రచురించడం వివాదస్పదమైంది. సెరెనా లుక్స్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్...పక్కన ఉమన్ అనే పదం కొటేషన్‌లో ఉండటం చూసి అవాక్కయ్యారు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో జీక్యూ మ్యాగజైన్‌పై మండిపడుతున్నారు. ప్రచారంలో భాగంగా చేసిన పనిలో పాజిటివ్ అయితే ఏంటి నెగిటివ్ అయితే ఏంటి జనాల్లోకి వెళ్లడమే కదా కావాల్సింది. ప్రస్తుతం ఆ కొటేషన్.. సెరెనా ఫొటో పాఠకుల్లోకి.. నెటిజన్లలోకి దూసుకెళ్తుంది.