For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముగ్గురు యువతులపై టెన్నిస్ కోచ్ రేప్: మరో కోచ్‌పైనా

ప్యారిస్: వరుసగా వస్తున్న లైంగిక ఆరోపణలు ఫ్రెంచ్ టెన్నీస్ క్రీడను కుదిపేస్తున్నాయి. బుధవారం మరో లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. ముగ్గురు అండర్ గ్రేడ్ విద్యార్థినిలపై టెన్నీస్ కోచ్ ఆండ్రూ గెడ్డెస్(48) అత్యాచారానికి పాల్పడ్డారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఆండ్రూ గెడ్డెస్‌పై.. ముగ్గురు మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలున్నాయని న్యాయవాది రాబర్ట్ గెల్లి తెలిపారు.

ప్యారీస్ సమీపంలోని సిర్సిల్లీస్ టెన్నీస్ క్లబ్‌లో కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న సమయం(1999-2005 మధ్య)లో ఆండ్రూ గెడ్డెస్ 12 నుంచి 17ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థినులపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. కాగా, గాడ్డెస్ తన దగ్గరికి వచ్చిన ముగ్గురు విద్యార్థినులపై తన ఇంట్లో, కారులో, క్లబ్‌లో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

French Tennis Rocked by New Case of Alleged Sexual Abuse

అంతేగాక టోర్నమెంట్ల కోసం బయటికి వెళ్లిన సమయంలోనూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాలను బయటపెడితే తమ భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తాడనే భయంతో బాధిత విద్యార్థినులు బయటికి చెప్పలేదని న్యాయవాదులు తెలిపారు. అయితే గత ఫిబ్రవరిలో ఓ బాధిత బాలిక గెడ్డెస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతోపాటు మరో ఇద్దరు కూడా పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు గెడ్డెస్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

శిక్షణ పొందుతున్న ఆ విద్యార్థినిలను శరీరకంగా, మానసికంగా హింసకు పాల్పడ్డాడని గెడ్డెస్‌పై అభియోగాలున్నాయని న్యాయవాది గెల్లి తెలిపారు. బాలికలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను తీసి బయటపెడ్తానని కూడా వారిని గెడ్డెస్ బెదిరింపులకు గురి చేశాడని చెప్పారు. కాగా, మరో టాప్ టెన్సీస్ కోచ్ రెగీస్ డి కెమరెట్‌పై కూడా అత్యాచార కేసులు నమోదయ్యారు. ఇతనిపై శిక్షణ కేంద్రంలో ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. దీంతో అతడు పరారీలో ఉన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+