న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్.. క్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్‌

French Open: Roger Federer and Rafael Nadal on course for semi-final date

మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్లో బరిలో దిగిన స్విస్ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ దూసుకెళుతున్నాడు. ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. స్పెయిన్‌ బుల్ రఫెల్‌ నాదల్‌తో, వావ్రింకా (స్విట్జర్లాండ్‌) తుది నాలుగు జాబితాలో చోటు సంపాదించారు. మహిళల సింగిల్స్‌లో జోనా కొంటా (బ్రిటన్‌), వాండ్రూసోవా (చెక్‌ రిపబ్లిక్‌), మార్టిచ్‌ (క్రొయేషియా) క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6-2, 6-3, 6-3తో లియోనార్డో మాయెర్‌ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఫెడరర్‌ 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 1991లో జిమ్మీ కానర్స్‌ 39 ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.

French Open: Roger Federer and Rafael Nadal on course for semi-final date

నాదల్‌ 6-2, 6-3, 6-3తో యువాన్‌ ఇగ్నాసియో లొండెరో (అర్జెంటీనా)ను ఓడించాడు. మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 7-6 (8/6), 5-7, 6-4, 3-6, 8-6తో ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకే వచ్చాడు. ఇక క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌తో వావ్రింకా తలపడనున్నాడు. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఫెడరర్, నాదల్‌ సెమీఫైనల్లో తలపడతారు.

మహిళల సింగిల్స్‌లో జోనా కొంటా, క్రొయేషియా భామ పెట్రా మారిచ్‌ క్వార్టర్స్‌లో ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో కొంటా 6-2, 6-4తో వికిచ్‌ (క్రొయేషియా)పై గెలుపొందింది. మార్టిచ్‌ 5-7, 6-2, 6-4తో కనెపి (ఇస్తోనియా)ను ఓడించింది. వాండ్రూసోవా 6-2, 6-0తో 12వ సీడ్‌ సెవాస్సోవా (లాత్వియా)పై.. స్లోన్‌స్టీఫెన్స్‌ (అమెరికా) 6-4, 6-3తో ముగురుజ (స్పెయిన్‌)పై గెలిచారు.

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బోపన్న-మారిస్‌ కొపిల్‌ (రొమేనియా) 6-1, 5-7, 6-7 (8-10)తో లజోవిచ్‌-తిప్సరవిచ్‌ (సెర్బియా) చేతిలో ఓడారు. లియాండర్‌ పేస్‌ కూడా డబుల్స్‌లో ఓడాడు.

Story first published: Monday, June 3, 2019, 8:13 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X