Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French open: మట్టి కోర్టులో రఫ్ఫాడించిన నాదల్.. క్వార్టర్లో జకోవిచ్ మీద గెలిచి సెమీస్‌లోకి ఎంట్రీ

French Open: Rafael Nadal win over novak djokovic in Quarters and enters to Semis

బుధవారం తెల్లవారుజామున జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌పై గెలుపొందాడు. నాలుగు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ తనదైన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. తద్వారా తన కెరీర్లో 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. రోలాండ్ గారోస్ కోర్ట్ ఫిలిప్ చాట్రియర్ నాదల్‌కు అచ్చొచ్చిన కోర్టు. ఇక్కడ అతను 13సార్లు గెలుపొందాడు. ఇకపోతే జకోవిచ్‌తో తన కెరీర్లో 59వ మ్యాచ్ ఆడిన నాదల్.. అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6 (7/4)తో ఓడించాడు. 4గంటల 12నిమిషాలపాటు మ్యాచ్ సాగింది. నాదల్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత అయిన జకోవిచ్‌తో జరిగిన 10ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్‌లలో తన ఎనిమిదో విజయాన్ని సాధించాడు. ఇకపోతే నాదల్ శుక్రవారం మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీఫైనల్లో తలపడనున్నాడు.

ఇక ఈ మ్యాచ్ అనంతరం నాదల్ మాట్లాడుతూ.. 'నేను చాలా ఎమోషనల్‌ అవుతున్నాను. ఇక్కడ ఆడటం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ విజయానుభూతి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. జకోవిచ్‌తో ఆడటం ఎల్లప్పుడూ అద్భుతమైన సవాలుగా తోస్తుంది. అతనిపై గెలవాలంటే మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు మనలోని అత్యుత్తమ ఆటను ఆడాల్సిందే' 35 ఏళ్ల నాదల్.. 2005లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్లో ఇప్పటివరకు 113 మ్యాచ్‌లు ఆడిన నాదల్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అలాగే తన కెరీర్లో జకోవిచ్‌తో తలపడ్డ 59మ్యాచ్ల్లో 30-29తేడాతో జకోవిచ్ కంటే ఒక మ్యాచ్ తక్కువగా గెలిచాడు.

ఐదవ సీడ్ అయిన నాదల్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచిన తర్వాత రికార్డు స్థాయిలో 22వ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. ఇకపోతే 20 గ్రాండ్ స్టామ్‌లు గెలిచిన జకోవిచ్ తన ట్రోఫీల సంఖ్యను 21కి చేర్చడానికి వింబుల్డన్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ.. 'నాదల్‌కు నా అభినందనలు, అతను ఆటలో చాలా సందర్భాలలో నాకంటే పైచేయి సాధించాడు' అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, June 1, 2022, 7:58 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+