For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open: ఎర్రమట్టి రారాజుకు షాక్.. తొలి రౌండ్‌‌లోనే ఓటమి

ఎర్రమట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్‌కు బిగ్ షాక్ తగిలింది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. బహుశా తన కెరీర్‌లో చివరి ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్న అతనికి ఊహించని పరాభవం ఎదురైంది. సోమవారం నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)‌తో జరిగిన పోరులో నాదల్ వరుస సెట్లలో 3-6, 6-7 (5-7), 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.

ఫ్రెంచ్ ఓపెన్‌లో 37 ఏళ్ల నాదెల్ అన్‌సీడెడ్ బరిలోకి దిగాడు. ప్రత్యర్థికి పెద్దగా పోటీఇవ్వకుండానే ఓటమి అంగీకరించాడు. తొలి సెట్‌లో చాలా స్వీయ తప్పిదాలు చేశాడు. బాల్‌ను కోర్టు బయటకు, నెట్స్ కొట్టి పాయింట్లు సునాయాసంగా సమర్పించుకున్నాడు. మరోవైపు జ్వెరెవ్ విన్నర్లతో విరుచుపడి తొలి సెట్‌ను సులువుగా గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో రఫెల్ గట్టిపోటీ ఇచ్చాడు. కానీ టైబ్రేకర్‌లో నిరాశపరిచాడు.

French Open Rafael Nadal Faces First-Round Exit in Possible Roland Garros Farewell

ఆ తర్వాత నాదల్ ఓటమికి ఎక్కువ సమయం పట్టలేదు. మూడో సెట్‌లో జ్వెరెవ్ చెలరేగి 6-3 తేడాతో గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఎర్రమట్టి కోర్టులో రఫెల్‌ను ఓడించిన మూడో ఆటగాడిగా జ్వెరెవ్ రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో సోదర్లింగ్, జకోవిచ్ తర్వాత రఫాను ఓడించింది జ్వెరెవ్ మాత్రమే. రఫెల్ నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్స్ సాధించగా 14 సార్లు ఎర్రమట్టిలోనే అందుకున్నాడు. అయితే గత రెండేళ్లుగా నాదల్ ఫామ్‌లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.

సుమిత్ నగాల్ ఓటమి
భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. రష్యా ప్లేయర్ కరెన్‌ కచానోవ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 0-6, 6-7 (5-7)తో పరాజయాన్ని చవిచూశాడు. తొలి సెట్‌లోనే తబడిన సుమిత్ రెండో సెట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి అంగీకరించాడు. ఇక మూడో సెట్‌లో పోరాడిన్పటికీ టైబ్రేకర్‌లో తడబడ్డాడు.

Story first published: Tuesday, May 28, 2024, 8:11 [IST]
Other articles published on May 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+