నాదల్‌కు ఎదురుందా!!.. 12వ ‘ఫ్రెంచ్’ టైటిల్‌పై కన్ను

గత దశాబ్దానికి పైగా మట్టి కోర్టులపై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు ఎదురే లేదు. ఇప్పటికే 11సార్లు ఈ టైటిల్ గెలిచిన ఈ స్పెయిన్ ఆటగాడు.. 12వసారి ఈ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. మట్టి కోర్టులపై నాదల్‌ను నిలువరించాలంటే అతని ప్రత్యర్థులు అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ (సెర్బియా) కూడా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించాలనే చూస్తున్నాడు. మరో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలో దిగుతున్నాడు.

జొకోవిచ్ నుంచే పోటీ:
ఆదివారం మధ్యాహ్నం నుండి మొదలయ్యే ఫ్రెంచ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్‌కు నొవాక్ జొకోవిచ్ నుంచే గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. నాదల్ తొలి రౌండ్లో హన్‌మన్ (జర్మనీ)తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్లో 86-2 విజయాల రికార్డు ఉన్న రఫాకు తన పార్మ్వంలో ఉన్న ఫెదరర్ నుంచే పోటీ ఎదురు కానుంది.

సొనెగొతో ఫెదరర్:
మరోవైపు జకోవిచ్.. హుర్‌కాజ్ (పోలెండ్)తో తొలి సమరంలో పాల్గొననున్నాడు. ఫెదరర్ తన తొలి రౌండ్లో సొనెగొ (ఇటలీ)తో ఆడనున్నాడు. భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మాత్రమే మెయిన్ ‘డ్రా'లో ఉన్నాడు. ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో హుగో డెలియన్ (బొలీవియా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఫేవరెట్‌గా ఒసాకా:
కెరీర్‌లో 25వ టైటిల్ కొట్టి మార్గరేట్ కోర్టు రికార్డును బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉన్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌కు ఫిట్‌నెసే ఆందోళన కలిగిస్తోంది. 2017లో చివరిగా గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) సాధించిన సెరెనా.. మాతృత్వం పొందాక టైటిల్ గెలవలేకపోయింది. జపాన్ సంచలనం, టాప్‌సీడ్ నొజొమి ఒసాకా ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. అయితే ఆమెకు రెండో రౌండ్‌లో మాజీ విజేత ఒస్టాపెంకో రూపంలో సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్, క్విటోవా, కెర్బర్, పిస్కోవా, అజరెంక టైటిల్ పోరులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications