
హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ విజేతలకు రూ.17.63 కోట్లుగా పెంచారు. అంతకుముందు అందజేసే ప్రైజ్‌మనీని ఎనిమిది శాతం పెంచడంతో ఇంత భారీ మొత్తంలో విజేతలకు అందనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతకు 2.2 మిలియన్ యూరోలు(రూ.17.63 కోట్లు) చొప్పున అందజేయనున్నారు.
ఇది గత ఏడాది కన్నా 100,000(రూ.80 లక్షలు) యూరోలు అధికం. టోర్నీ ఓవరాల్ ప్రైజ్‌మనీ 39.197 మిలియన్ యూరోల(రూ.314 కోట్లు)కు పెరిగినట్టు టోర్నమెంట్ డైరెక్టర్ గయ్ ఫోర్జట్ వెల్లడించారు. ఇది గత ఏడాది కన్నా 3 మిలియన్ యూరోలు(రూ.24 కోట్లు) అధికం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మే 21 నుంచి జూన్ 10 వరకు నిర్వహించనున్నారు.
ఇది ప్రైజ్ మనీ పెంపు ఫైనల్‌లో గెలిచిన విజేతలకే కాదు. మొదటి రౌండ్ గెలిచి రెండో ఓడిపోయిన వారికి ఇచ్చే పారితోషకంలో కూడా వర్తించనుంది. దీనిని కూడా 10% పెంచి అంతకుముందున్న 36మిలియన్ యూరోలను 39.2మిలియన్ యూరోలుగా ప్రకటించారు.
మొదటి రౌండ్‌లో ఓడిపోయిన విజేతలకు సైతం మళ్లీ పెంచనున్నట్లు ప్రకటించింది నిర్వహక సంఘం. ప్రతి ప్లేయర్‌కు 40వేల యూరోలు ఇవ్వనున్నారు. 2017 సంవత్సరంతో పోలిస్తే ఇది 5వేల యూరోలు అధికం. ఈ టోర్నమెంట్ మే నెలలో పారిస్‌లోని రోలాండ్ గార్రోస్ వేదికగా జరగనుంది.