Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ నెంబర్ వన్‌కు ముచ్చెమటలు.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన జొకోవిక్!

ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిక్ మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు 22 మేజర్ టైటిల్స్ సాధించిన అతను.. ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్‌ను చిత్తుగా ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో అడుగు పెట్టాడు. ఈ టైటిల్ కూడా నెగ్గితే ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడీ సెర్బియన్ స్టార్.

ఈ టెన్నిస్ వీరుడు రికార్డుస్థాయిలో ఏడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కారెజ్‌ను చిత్తుచేసిన నొవాక్‌.. ఓవరాల్‌గా 34వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్ చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ జొకోవిక్ 6-3, 5-7, 6-1, 6-1తో టాప్‌సీడ్‌ అల్కారెజ్‌పై ఘనవిజయం సాధించాడు.

Novak Djokovic

మొత్తం 3 గంటల 23 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగడం గమనార్హం. ఇంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో రెండో సెట్‌ కోల్పోయిన జొకో.. ఆ తర్వాత విజృంభించాడు. అల్కారెజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌ నాలుగో గేమ్‌లో కార్లోస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నొవాక్‌ 6-3తో ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రెండో సెట్‌లో అల్కారెజ్‌ గట్టిపోటీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది.

అనంతరం 8వ గేమ్‌లో జొకో సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కార్లోస్‌ 5-3తో పైచేయి సాధించాడు. కానీ, ఆ తర్వాతి గేమ్‌లో అల్కారెజ్‌ సర్వీస్ బ్రేక్‌ చేసిన నొవాక్‌.. 10వ గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకోవడంతో స్కోరు 5-5తో సమమైంది. తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించిన కార్లోస్‌ 7-5తో రెండో సెట్‌ నెగ్గాడు. మూడో సెట్‌ మొదలవ్వాల్సిన సమయంలో అల్కారెజ్ చేతి కండరాలు పట్టేశాయి.

ఫిజియో వద్ద చికిత్స తీసుకొని మళ్లీ బరిలోకి దిగినా కూడా అల్కారెజ్ కదలికలు కొంత నెమ్మదించాయి. దీంతో చెలరేగిన జొకోవిక్ 6-1తో మూడో సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. ఆ తర్వాత అల్కరజ్‌ మెడికల్‌ టైమౌట్‌ తీసుకొన్నా పుంజుకోలేక పోయాడు. దీంతో నాలుగో సెట్‌ను కూడా జొకో సులభంగా గెలిచాడు. ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెనర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Story first published: Saturday, June 10, 2023, 10:30 [IST]
Other articles published on Jun 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+