Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జొకో.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం!

సెర్బియన్ యోధుడు నొవాక్‌ జొకోవిక్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్‌ను చిత్తు చేసిన జొకో.. ఫైనల్‌లో నార్వేకు చెందిన నాలుగో సీడ్ క్యాస్పర్ రూడ్‌ను కూడా ఓడించాడు. ఈ క్రమంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఈ క్రమంలో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ (22) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో యువ ఆటగాడు కాస్పర్‌ రూడ్‌పై వరుస సెట్లు నెగ్గిన జొకో మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో 7-6(1), 6-3, 7-5 తేడాతో నాలుగో సీడ్‌ రూడ్‌‌ను చిత్తుగా ఓడించాడు.

Novak Djokovic

ఈ మ్యాచ్ 3 గంటల 13 నిమిషాలపాటు సాగడం గమనార్హం. జొకోను ఓడించేందుకు రూడ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఎలాంటి అతని ప్రయత్నాలు ఫలించలేదు. జొకో అద్భుతమైన ఆట ముందు రూడ్ నిలవలేకపోయాడు. ఈ ఫైనల్‌లో నొవాక్‌ 11 ఏస్‌లు సంధిస్తే.. కాస్పర్‌ 4 మాత్రమే స్కోర్ చేయగలిగాడు. ఇద్దరూ అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 52 విన్నర్లతో జొకో ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఈ విజయంతో జొకోవిచ్‌ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌ ఖాతాలో ఇప్పుడు 10 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 3 ఫ్రెంచ్‌ ఓపెన్‌, 7 వింబుల్డన్‌, 3 యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లున్నాయి. కాగా, అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పోలండ్ భామ ఇగా స్వియాటెక్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఆమె ఫైనల్‌లో అద్భుతమైన ఆటతో మరో టైటిల్ తన ఖాతాలో వేసుకుంది.

Story first published: Monday, June 12, 2023, 13:32 [IST]
Other articles published on Jun 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+