Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం: ఇంటిదారి పట్టిన జొకోవిచ్

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచనలం నమోదైంది. పురుషుల డిఫెండింగ్ చాంపియ‌న్‌, మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ నొవాక్ జొకోవిచ్ క్వార్ట‌ర్‌ ఫైన‌ల్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండో సీడ్‌గా బ‌రిలోకి దిగిన జొకోవిచ్.. ఆరో సీడ్ ఆస్ట్రియా ప్లేయ‌ర్ డొమినిక్ థీమ్ చేతిలో వ‌రుస సెట్ల‌లో పరాజయం పాలయ్యాడు.

థీమ్ ప‌వ‌ర్ ప్లే ముందు జొకోవిచ్ క్లాస్ ప‌నిచేయక పోవడం గమనార్హం. 7-6, 6-3, 6-0 తేడాతో జొకోవిచ్‌ని థీమ్ ఓడించి సంచలనం సృష్టించాడు. తొలి సెట్ టై బ్రేక‌ర్ వ‌ర‌కు తీసుకెళ్లినా.. రెండు, మూడు సెట్ల‌లో నొవాక్ క‌నీసం పోరాడ లేకపోయాడు. జొకోవిచ్‌పై థీమ్ గెల‌వ‌డం ఇదే తొలిసారి.

French Open: Nadal to face Thiem in semi-final, Djokovic crashes out

వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, మంగళవారం నాటి మ్యాచ్ బుధవారం కొనసాగింది. తాజా విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో నాలుగో సీడ్ తొమ్మిది పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన 'స్పెయిన్ బుల్' రాఫెల్ నాదల్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్‌లో పాబ్లో కారెనో బస్టాపై నాదల్ గెలిచాడు.

మ‌రోవైపు టోర్నీ ఫేవ‌రెట్ ర‌ఫెల్ న‌డాల్ రోలాండ్ గారోస్‌లో త‌న వందో విక్ట‌రీని న‌మోదు చేశాడు. క్వార్టర్‌ఫైన‌ల్లో అత‌ని ప్ర‌త్య‌ర్థి కారెనో బుస్టా రెండో సెట్‌లోనే క‌డుపు నొప్పితో త‌ప్పుకున్నాడు.

తొలి సెట్‌ను 6-2తో గెలిచిన రఫెల్ నాదల్ రెండో సెట్‌లోనూ 2-0తో లీడ్‌లో ఉన్న స‌మ‌యంలో బుస్టా త‌ప్పుకున్నాడు. ఇది నాదల్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో వందో విజ‌యం కావ‌డం విశేషం. రోలాండ్ గారోస్‌లో 102 మ్యాచ్‌లు ఆడిన నాదల్ కేవలం రెండింట్లోనే ఓడిపోయాడు.

ఇప్పుడు డిఫెండింగ్ చాంపియ‌న్ కూడా క్వార్ట‌ర్స్‌లోనే ఓడిపోవ‌డంతో.. ప‌దో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు నాదల్ మ‌రింత చేరువ‌య్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ముందున్న ఏకైక అడ్డంకి టాప్ సీడ్ ఆండీ ముర్రేనే. ముర్రేపై విజయం సాధిస్తే ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫెల్ నాదల్‌తో మరో చరిత్ర సృష్టిస్తాడు.

ఇక, మహిళల సింగిల్స్‌లో సిమోనా హాలెప్ సెమీ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె 3-6, 7-6, 6-0 తేడాతో ఎలినా స్విటొలినియాను ఓడించింది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గాబ్రియేల డబ్రోవ్‌స్కీతో కలిసి ఆడుతున్న భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫైనల్ చేరాడు. వీరు సుమీ ఫైనల్‌లో ఆండ్రె హ్లావస్కోవా, ఎడ్యురార్డ్ రోజర్ వెసెలిన్ జోడీపై 7-5, 6-3 తేడాతో గెలిచారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+