Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పిపోవడమంటే ఇష్టమని చెబుతున్న టెన్నిస్ ముద్దుగుమ్మ

ప్యారిస్: తనకు ప్రయాణాల్లో తప్పిపోవడం అంటే ఇష్టమని రష్యన్ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అన్నారు. తాను ఓసారి టోక్యోలో ప్రయాణిస్తున్నానని, తనకు అక్కడి భాష నాకు రాదని, అక్కడ ఏమీ అర్థం కావడం లేదని చెప్పింది.

ఎటు వెళ్తున్నానో తనకు తెలియకుండా పోయిందని చెప్పింది. అయితే, అదో సాహసం అని చెప్పింది. ఇలా తప్పిపోవడం భలే బాగుంటుందని చెప్పింది. తనకు సముద్ర తీరం అంటే చాలా ఇష్టమని చెప్పింది.

సమయం దొరికితే బీచ్‌కు వెళ్తానని చెప్పింది. కొబ్బరి నీళ్లు తాగుతూ సేద తీరుతానని చెప్పింది. తన వెంట పెంపుడు కుక్క ఉంటుందని చెప్పింది. బీచ్‌లలో తాను ఉదయం పూట యోగా చేస్తుంటానని చెప్పింది.

French Open: Maria Sharapova starts title defence with win

కాగా, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి సంచలనం నమోదైంది. ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ రద్వాన్‌స్కా ఆరంభ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. రద్వాన్‌స్కాకు జర్మనీ యువ క్రీడాకారిణి అనికా బెక్‌ షాకిచ్చింది. సబినే లిసికితో పాటు డిఫెండింగ్‌ చాంపియన్‌ మరియా షరపోవా, సమంత స్టోసర్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ ఆండీ మర్రే (బ్రిటన్‌) అర్గెలో (అర్జెంటీనా)పై నెగ్గాడు. బెర్డిచ్‌ (చెక్‌రిపబ్లిక్‌) యోషిహింటో (జపాన్‌)పై విజయం సాధించాడు. 27వ సీడ్‌ బెర్నార్డ్‌ టామిక్‌ (ఆస్ర్టేలియా) లుకా వాన్‌ (ఇటలీ)పై నెగ్గాడు. అన్‌సీడెడ్‌ గాబ్‌షివిల్లీ (రష్యా) 11వ సీడ్‌ లోపెజ్‌ (స్పెయిన్‌)కు షాకిచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+