Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వియాటెక్ సంచలనం.. సెమీస్‌కు దూసుకెళ్లిన డిఫెండింగ్ ఛాంపియన్!

ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌ అద్భుతంగా దూసుకుపోతోంది. తన టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో ముందడుగు వేసింది. ఈ పోలెండ్‌ స్టార్‌.. మహిళల సింగిల్స్‌ విభాగం సెమీఫైనల్‌ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో అమెరికన్ స్టార్ కోకో గాఫ్‌ను స్వియాటెక్ ఓడించింది. ఆమెతోపాటు బ్రెజిల్‌కు చెందిన బియాట్రిజ్‌ హదాద్‌ మయా కూడా సెమీస్‌ చేరింది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్‌ స్వియటెక్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై వరుస సెట్లలో 6-4, 6-2తో ఆధిపత్యం చెలాయించింది. ఇలా వరుస సెట్లలో విజయాలు సాధించిన ఆమె సెమీస్‌కు దూసుకెళ్లింది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కూడా వీళ్లిద్దరే తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో గాఫ్‌ను చిత్తు చేసిన స్వియెటెక్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

French Open Iga swiatek reaches semi-finals after defeating Coco Gauf for the seventh time

ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియటెక్ ఇలా 19 ఏళ్ల అమెరికన్‌తో కోకో గాఫ్‌ను ఓడించడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. వీళ్లిద్దరూ తలపడిన ఒక్కసారి కూడా గాఫ్‌కు విజయం దక్కలేదు. గురువారం జరిగే సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్‌ హదాద్‌ మయాతో స్వియటెక్‌ అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్ ఫైనల్‌లో హదాద్‌ 3-6, 7-6 (5), 6-1తో ఏడో సీడ్‌ ఆన్స్‌ జెబ్యూర్‌ (ట్యునీసియా)కు షాకిచ్చింది.

ఓపెన్‌ ఎరాలో ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి బ్రెజిల్‌ క్రీడాకారిణిగా హదాద్‌ రికార్డు సృష్టించింది. అదే సమయంలో, పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 22వ సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 3-6, 6-3, 6-4తో మార్టిన్‌ ఎట్చ్‌వరీ (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్‌ చేరాడు. ఇక పురుషుల సింగ్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్, నొవాక్ జొకోవిక్ ఇద్దరూ సెమీస్ చేరారు. వీళ్లిద్దరి పోరు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Story first published: Thursday, June 8, 2023, 15:28 [IST]
Other articles published on Jun 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+