Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊపిరి తీసుకోలేక కుప్పకూలిన ప్రత్యర్థి.. ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వియాటెక్ ముందంజ!

ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన లెసియా సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదటి సెట్‌ ఆడుతున్న సమయంలోనే సురెంకోకు అనారోగ్యం చేసింది. ఆమె ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆమెకు మెడికల్ సిబ్బంది చికిత్స చేశారు.

అయినా సరే ఆమె ఇక ఆట కంటిన్యూ చేయలేదని తేలడంతో సురెంకో రిటైర్ అవ్వాల్సి వచ్చింది. దీంతో స్వియాటెక్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ ఫోర్త్ రౌండ్ మ్యాచ్ ఆరంభం నుంచే స్వియాటెక్ ఎదురుదాడికి దిగింది. సురెంకోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 4-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. అప్పుడే సురెంకో ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడటం కనిపించింది.

French open defending champion Iga Swiatek reaches quarter finals.

దీంతో డాక్టర్‌ను పిలిచి ఆమెకు ప్రథమ చికిత్స అందజేశారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన కోకో గాఫ్‌.. క్వార్టర్ ఫైనల్‌లో స్వియాటెక్‌ను ఎదుర్కోనుంది. గత సీజన్‌ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది. ఇక మిగతా మ్యాచుల విషయానికి వస్తే.. క్యాస్పర్ రూడ్, హోల్గర్ రూన్ ఇద్దరూ కూడా చివరి వరకు పోరాడి విజయాలు సాధించారు.

ప్రపంచ నెంబర్ 6 హోల్గర్ రూన్ కొంత ఇబ్బంది పడినా కూడా చివరకు విజయం సాధించాడు. ఫ్రాన్సిస్కో సెరూండోలోతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సెట్ గెలిచిన రూన్ గెలిచాడు. దాదాపు ఓడిపోతాడని అనుకుంటున్న సమయంలో రూన్ అద్భుతంగా పుంజుకొని విజయం సాధించాడు. దీంతో అర్జెంటీనా ప్లేయర్ ఫ్రాన్సిస్కో ఓటమి పాలయ్యాడు.

ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో రూన్ 7-6 (3), 3-6, 6-4, 1-6, 7-6 (7) తేడాతో విజయం సాధించాడు. ముఖ్యంగా నాలుగో సెట్‌లో రూన్ ఏకంగా 0-40తో వెనుక బడ్డాడు. అయితే ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని అర్జెంటీనా ప్లేయర్‌ను చిత్తు చేశాడు. మరో స్టార్ క్యాస్పర్ రూడ్ కూడా చాలా కఠినమైన మ్యాచ్‌లో విజయం సాధించాడు. మూడు గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో నికోలస్ జారీని అతను ఓడించాడు.

Story first published: Tuesday, June 6, 2023, 11:07 [IST]
Other articles published on Jun 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+