టెన్నిస్ అభిమానులకు చేదు వార్త: ఫ్రెంచ్ ఓపెన్‌కు షరపోవా దూరం

హైదరాబాద్: టెన్నిస్ అభిమానులకు చేదువార్త. మాజీ ఫ్రెంచ్ ఛాంపియన్, రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నట్లు షరపోవా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు
"ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభతరం కాదు" అని షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. తన కెరీర్‌లో మొత్తం ఐదు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మారియా షరపోవా ఇందులో రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.

రెండు సార్లు ఛాంపియన్1గా
2012, 14 సంవత్పరాల్లో షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. 32 ఏళ్ల మారియా షరపోవా ప్రసుత్తం ప్రపంచ ర్యాంకుల్లో 35వ ర్యాంకులో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షరపోవా భుజానికి శస్త్రచికిత్స చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరి నుంచి ఏ టోర్నీలోనూ షరపోవా పాల్గొనలేదు.

ఫిబ్రవరిలో శస్త్ర చికిత్స
ఫిబ్రవరి నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ప్రస్తుతం తిరిగి కోలుకుంటున్నారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మే 26వ తేదీ నుంచి జూన్ 9 వరకు జరగనుంది. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో షరపోవా క్వార్టర్ ఫైనల్స్‌లో ముగురుజా చేతిలో 6-2, 6-1 తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications