Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్‌కు పండుగ.. సెమీస్‌లో జొకోవిక్‌తో ప్రపంచ నెంబర్‌ వన్ పోరు!

ఫ్రెంచ్ ఓపెన్‌లో హాట్‌ ఫేవరెట్‌‌గా బరిలో దిగిన స్టార్ నొవాక్‌ జొకోవిక్‌ ఈ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లాడు. జొకోతోపాటు మహిళల రెండో సీడ్‌ అరియానా సబలెంక, చెక్‌ రిపబ్లిక్‌ సంచలన తార కరోలినా ముచోవా కూడా సెమీఫైనల్ చేరుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ పోరులో మూడో సీడ్‌ జొకోవిక్‌.. రష్యాకు చెందిన 11వ సీడ్‌ కారెన్‌ కచనోవ్‌పై కష్టపడి నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో జోకో 4-6, 7-6(0), 6-2, 64తో విజయం సాధించాడు.

మరో పోరులో ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్ కూడా అదరగొట్టాడు. గ్రీస్‌కు చెందిన ఐదో సీడ్ ప్లేయర్ స్టెఫానోస్ ట్సిట్సిపాస్‌తో తలపడిన అతనుత తొలి రెండు రౌండ్స్‌లో 6-2, 6-1తో చెలరేగాడు. అతను ఆడిన టెన్నిస్‌కు ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకపోయింది. అయితే మూడో రౌండ్‌లో స్టెఫానోస్ కూడా పుంజుకున్నాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ రౌండ్‌లో చెమటోడ్చిన అల్కారెజ్ చివరకు 7-6 (5) తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు.

French Open Djokovic to face Alcaraz in Semi-finals

దీంతో పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సెర్బియన్ స్టార్ జొకోవిక్‌తో తలపడేందుకు అల్కారెజ్ రెడీ అయ్యాడు. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచిన అల్కారెజ్ తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అదే సమయంలో మూడో సీడ్ జొకోవిక్‌ తన 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోరాడుతున్నాడు. అది కనుక సాధిస్తే జొకో పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.

ఇక నాలుగో రౌండ్‌ పోరులో అర్జెంటీనా అన్‌సీడెడ్‌ ఆటగాడు టోమాస్‌ మార్టిన్‌ ఎట్చ్‌వరీ 7-6(8), 6-0, 6-1తో 27వ సీడ్‌ నిషియోక (జపాన్‌)ను ఓడించిన క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ముచోవా 7-5, 6-2తో మాజీ రన్నరప్‌ ప్యావలుచెన్‌కొవా (రష్యా)పై వరుస సెట్లలో నెగ్గి తొలిసారి సెమీస్‌ చేరింది. మరో మ్యాచ్‌లో సబలెంక 6-4, 6-4తో స్విటోలినాపై అలవోకగా గెలిచి సెమీఫైనల్‌లో అడుగు పెట్టింది. ఆమె ఈ పోరులో ముచోవాతో తలపడనుంది.

Story first published: Wednesday, June 7, 2023, 10:08 [IST]
Other articles published on Jun 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+